అక్కడ ఎక్కువ సమయం నేను ఉండలేను.. ఆమెకు రెండో తల్లిని నేనే..: రష్మిక మందన

1 week ago 3

| Samayam Telugu | Updated: Sep 15, 2021, 7:44 PM

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక తనకు సంబంధించి పలు కీలక విషయాలను బయటపెట్టింది. తెలుగుతో పాటు బాలీవుడ్‌లో కూడా సినిమాలు చేస్తున్న ఆమె.. ముంబైలో అపార్ట్‌మెంట్ కొనుగోలు చేయడానికి గల కారణాలను వెల్లడించింది.

రష్మిక మందన

‘ఛలో’ అంటూ టాలీవుడ్ గడపతొక్కి క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది కన్నడ భామ రష్మిక మందన. ‘గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ’ లాంటి వరుస హిట్స్ ఖాతాలో వేసుకొని సూపర్ ఫామ్ కొనసాగిస్తోంది. తన అందచందాలతో కుర్రాళ్ళ మనసు దోచుకున్న ఈ బ్యూటీ.. వరుస ఆఫర్స్‌తో ఫుల్ బిజీ అయింది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషా చిత్రాల్లో కూడా నటిస్తూ నేషనల్ క్రష్ అయింది రష్మిక. ఇకపోతే ఈ మధ్యకాలంలో నెమ్మదిగా హాట్ డోస్ పెంచేస్తూ హీటు పుట్టిస్తోంది ఈ ముద్దుగుమ్మ.అయితే ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో ‘మిస్టర్ మంజు, గుడ్‌బై’ అనే సినిమాలతో పాటు తాజాగా మరో సినిమాను కూడా ఒప్పుకుంది. ఇక తెలుగులో ఆమె ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. దీంతో పాటు ‘ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే మూవీ చేస్తోంది. అయితే బాలీవుడ్‌లో వరుసగా సినిమా ఆఫర్లు వస్తుండటంతో ముంబైలో ఓ అపార్ట్‌మెంట్‌ని కొనుగోలు చేసిందట రష్మిక. ముంబై వెళ్లిన ప్రతిసారి హోటల్ ఉండాల్సి వస్తుండటంతో ఆమె ఈ నిర్ణయం తీసుకుందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది.

తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎక్కువ సమయంలో హోటల్‌లో ఉంటడం నాకు ఇష్టం లేదు. అందుకే ముంబైలో ఓ ఇళ్లు కొనుగోలు చేశాను. ఇక్కడి నుంచి షూటింగ్‌కి వెళ్లడం ఎంతో సౌకర్యంగా ఉంది’’ అని పేర్కొంది. ఇక ఎప్పటికి తన కుటుంబంతో కలిసి ఉండటమే తనకు ఇష్టమని.. తనకు తన సోదరికి 16 సంవత్సరాల వయస్సు తేడా ఉంది అని.. ఆమెకు తానే రెండో తల్లి అని తెలిపింది. ఇక తన అపార్ట్‌మెంట్ లోపల ఇంటీరియర్ డిజైనింగ్ తానే చేసినట్లు రష్మిక తెలిపింది.

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్ పేజీను లైక్ చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి

Web Title : rashmika mandanna buys a new apartment in mumbai
Telugu News from Samayam Telugu, TIL Network

Read Entire Article