అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ గుడ్ న్యూస్.. ఈ ఫోన్లపై భారీ తగ్గింపు!

1 week ago 1

| Samayam Telugu | Updated: Sep 15, 2021, 3:06 PM

మీరు ఐఫోన్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మీకోసం అదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. భారీ తగ్గింపు లభిస్తోంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఫోన్ కొనుగోలు చేయొచ్చు.

smartphone

ప్రధానాంశాలు:

కొత్తగా ఐఫోన్ కొనే వారికి శుభవార్తభారీ తగ్గింపుఈకామర్స్ సంస్థల్లో అందుబాటులో
మీరు ఐఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మీకోసం అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. భారీ తగ్గింపు లభిస్తోంది. యాపిల్ కంపెనీ కొత్త ఐఫోన్లను తీసుకువస్తు్న్న నేపథ్యంలో ఐఫోన్ 12 సిరీస్‌పై భారీ తగ్గింపు అందిస్తోంది.

దిగ్గజ ఈకామర్స్ సంస్థల్లో ఒకటైన ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 12 సిరీస్‌పై భారీ తగ్గింపు ఉంది. ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ 128 జీబీ వేరియంట్‌ను రూ.1.25 లక్షలకు, 256 జీబీ వేరియంట్‌ను రూ.1.35 లక్షలకు, 512 జీబీ వేరియంట్‌ను రూ.1.55 లక్షలకు కొనొచ్చు.

Also Read: శుభవార్త.. భారీగా దిగొచ్చిన బంగారం ధర.. అక్కడి నుంచి..

ఐఫోన్ 12 మిని 128 జీబీ వేరియంట్ ధర ఇప్పుడు రూ.64,999గా ఉంది. ఇది వరకు దీని ధర రూ.74,900. అంటే దాదాపు రూ.10 వేల వరకు తగ్గింపు లభిస్తోంది. 64 జీబీ వేరియంట్ రూ.59,999కు కొనొచ్చు. దీని ధర ఇది వరకు రూ.69,900. ఇంకా 256 జీబీ వేరియంట్‌ను రూ.74,999కు కొనుగోలు చేయొచ్చు.

ఇంకా ఐఫోన్ 11 ప్రో‌ 64 జీబీ వేరియంట్‌ను రూ.79,999కు కొనొచ్చు. దీనిపై 24 శాతం తగ్గింపు లభిస్తోంది. ఇంకా అన్ని ఐఫోన్లపై రూ.15 వేల వరకు ఎక్స్చేంజ్ తగ్గింపు ఉంది. అదేసమయంలో అమెజాన్‌లో అయితే ఐఫోన్ 12 ప్రో మ్యాక్‌ 128 జీబీ వేరియంట్‌ను రూ.1.15 లక్షలకు, 256 జీబీ వేరియంట్‌ను రూ.1.25 లక్షలకు సొంతం చేసుకోవచ్చు. రూ.14 వేల తగ్గింపు లభిస్తోంది.

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్ పేజీను లైక్ చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి

Web Title : apple iphones on sale at huge discounts on amazon flipkart
Telugu News from Samayam Telugu, TIL Network

Read Entire Article