అలోవేరా జెల్ ఆ సమస్యలని కూడా దూరం చేస్తుందా..

4 months ago 3

| Samayam Telugu | Updated: Sep 14, 2021, 10:34 PM

మనలో చాలా మందికి అలోవేరా (కలబంద) గురించి తెలిసే ఉంటుంది. ఈ అలోవేరా మొక్కల వలన అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని చాలా మంది చెబుతారు. అసలు అలోవేరాను వాడడం వలన కలిగే ప్రయోజనాల మాట వాస్తవమేనా? లేక కల్పితమా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

aloevera gel

ప్రధానాంశాలు:

అనేక రకాలుగా ఉపయోగపడే అలోవేరా జెల్అందం, ఆరోగ్యాన్నిస్తుందంటున్న నిపుణులు
అలోవేరా మొక్కల విషయానికి వస్తే ఇవి చాలా ఉష్ణోగ్రతలు ఉన్న ప్రదేశాల్లో కలబంద మొక్కలు విరివిగా పెరుగుతాయి. ఇవి పెరిగేందుకు ఎక్కువగా నీరు కూడా అవసరం ఉండదు. కాబట్టి ఈ మొక్కలు విరివిగా పెరుగుతాయి. ఈ మొక్కల నుంచి వచ్చిన కలబంద బెరడుతో అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయని అనేక మంది చెబుతారు.
భార్య కంటే ఫ్రెండ్‌తో ఎక్కువగా క్లోజ్‌గా ఉంటే.. తప్పా..
వేడి, సూర్య రశ్మి నుంచి ఉపశమనం పొందేందుకు కలబంద ఉపయోగపడుతుందని చాలా మంది చెబుతారు. అమెరికా లాంటి ప్రాంతాల్లో వేడి వాతావరణం నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు బీచ్ లకు వెళ్తారు. మరియు కొంత మంది కలబందను వేడి నుంచి ఉపశమనం పొందేందుకు వాడతారు. కలబంద రసాన్ని తలపై మర్దనా చేసుకుంటే వేడి వాతావరణం కలిగిన అలసట ఇట్టే దూరమయిపోతుందని చాలా మంది ఈ విధానాన్ని ఉపయోగించిన వారు పేర్కొంటున్నారు. ఇలా కలబందతో అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు.

ఇన్ని ప్రయోజనాలను కలిగి ఉన్న అలోవేరా మొక్కలు పెరిగేందుకు ఎటువంటి పోషకాలు అవసరం ఉండవు. ఇవి పెరిగేందుకు అవసరమైన నీరు కూడా చాలా తక్కువ. ఇది పొడిగా ఉన్న ప్రదేశాల్లో కూడా ఈజీగా పెరుగుతుంది. ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల నుంచి ప్రజలు ఈ మొక్కల నుంచి వచ్చిన బెరడులో ఉన్న జెల్ ను శరీరం మీద కాలిన గాయాలు ఉన్నా, ఎటువంటి దద్దుర్లు ఉన్నా కానీ అప్లై చేస్తున్నారు. ఇలా చేయడం వలన గాయాలు ఈజీగా మానిపోతున్నాయని అనేక మంది చెబుతున్నారు. ఏళ్లుగా ఈ అలోవేరా వైద్యం అందరికీ అందుబాటులో ఉంటూ వస్తోంది. అలోవేరా బెరడులో ఉన్న జెల్లో అనేక రకాల విటమిన్లు, పోషకాలు ఉంటాయి. ఇది ప్రధానంగా నీటితో నిండి ఉంటుంది. ఈ జెల్‌లో అనేక రకాల విటమిన్లు, ఎంజైమ్స్ అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఈ అమైనో ఆమ్లాల వలన అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
ఆలుగడ్డలతో పాలు.. ఎలా తయారుచేస్తున్నారో తెలుసా..
అందుకోసమే ప్రపంచవ్యాప్తంగా అలోవేరా జెల్కు భారీ డిమాండ్ ఏర్పడింది. 2020వ సంవత్సరంలో గ్లోబల్ అలోవేరా జెల్ మార్కెట్ దాదాపు 625 మిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంది. ఈ ఏడాదిలో అలోవేరా మార్కెట్ మరింతగా పెరిగింది. ఇలా అలోవేరా జెల్ కు ధర పెరగడం వలన సామాన్యులకు అలోవేరా వల్ల చేకూరే ప్రయోజనాలు అందకుండా పోయాయి. భవిష్యత్ లో అలోవేరా మార్కెట్ మరింత పెరగనున్నట్లు నిపుణులు అంచనా వేశారు. కానీ పెరుగుట తరుగుట కొరకే అన్న చందంగా కొన్ని రకాల అలోవేరా ఉత్పత్తుల్లో ప్రమాదకర విషానికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నట్లు జూలై నెలలో కనుక్కొన్నారు.

iStock-1307325504 (1)


ఓ బ్రాండ్ అలోవేరా ఉత్పత్తుల్లో ఈ విషపదార్థాలను గుర్తించారు. బెంజీన్ కారకాలు అధికంగా ఉన్నాయని తెలిపారు. ఇలా బెంజీన్ అధికంగా ఉండడంతో పాటు కాన్సర్ కలుగజేసే కారకాలను కూడా గుర్తించారు. ఒక వేళ ఎవరైనా ఈ బ్రాండ్ అలోవేరా జెల్ ను వాడితే అలోవేరా వలన శరీరానికి కలిగే ప్రయోజనాలు పక్కన పెడితే కాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు సూచించారు. ఈ కంపెనీకి చెందిన రిటైల్ స్టోర్లు, మరియు ఆన్ లైన్ లో అమ్ముతున్న ప్రొడక్టులలో కూడా విషపు ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. కొన్ని రకాల అలోవేరా ఉత్పత్తులలో సరైన విధంగా అలోవేరా జెల్ ఉండట్లేదని కొందరు గుర్తించారు. కాబట్టి అలోవేరాను కొనే ముందు నిశితంగా పరిశీలించి తీసుకోవడం చాలా బెటర్ అని అనేక మంది సూచిస్తున్నారు. మనం అలోవేరా జెల్ ను తీసుకునే ముందు సరిగా పరిశీలించకపోతే.. మనం మోసపోయే ప్రమాదం ఉంటుంది.

అలోవేరా జెల్ వనల కలిగే ప్రయోజనాలను ఒకసారి పరిశీలిస్తే...

అసలు సూర్యరశ్మి వలన కలిగే దుష్ఫ్రభావాలను తొలగిస్తుందా?


సూర్య రశ్మి ప్రభావం వలన అనేక మందిలో చర్మంపై దుష్ఫ్రభావాలు ఏర్పడతాయి. అసలు అలోవేరాను వాడడం వలన సూర్యరశ్మి వలన కలిగే దుష్ప్రభావాలను మనం సులభంగా తొలగించుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకు సంబంధించి అనేక మంది చేసిన పరిశోధనలు కూడా అలోవేరా జెల్ వలన దుష్ఫ్రభావాలను దూరం చేస్తుందని తెలిపాయి. 2012వ సంవత్సరంలో ఫ్లోరిడా యూనివర్సటి ఆఫ్ కాలేజీకీ చెందిన ఓ శాస్త్రవేత్త కలబంద ప్రయోజనాల పై చేసిన 18 రకాల క్లినికల్ ట్రయల్స్ పై రివ్యూ చేశాడు. వివిధ పరిస్థితుల్లో అలోవేరాను వాడడం గురించి ఈ 18 రకాల వైద్య పరీక్షలు నిర్వహించబడ్డాయి. కాలిన గాయాలు, జననేంద్రియ సమస్యలు, చుండ్రు సమస్య, సోరియాసిస్ సమస్యల గురించి క్లినికల్ ట్రయల్స్ చేశారు. ఈ క్లినికల్ ట్రయల్స్లో అలోవేరా వలన కలిగే అనేక ప్రయోజనాల గురించి తెలిసింది. పైన పేర్కొన్న ప్రయోజనాలే కాకుండా సూర్యరశ్మి వలన కలిగే దుష్ర్ఫభావాలను కూడా అలోవేరా తొలగిస్తుందని కనుక్కొన్నారు.
వెన్న కంటే నెయ్యి మంచిదా..
40 మంది వ్యక్తులను రాండమ్ గా పరిశీలించిన తర్వాత 2008లో అందుకు సంబంధించిన జర్నల్ ను ఆయన ప్రచురించారు. ఈ రీసెర్చ్‌లో ఏం తేలిదంటే... పలువురు వ్యక్తుల శరీరాలపై ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాలను ప్రసరింపజేశారు. అప్పుడు అయిన గాయాలకు వివిధ పద్ధతుల్లో చికిత్సలు చేశారు. అలోవేరా జెల్ తో ఈ కాలిన గాయాలకు చికిత్స చేసినపుడు 97.5 శాతం అలోవేరా జెల్, ఒక శాతం హైడ్రో కార్టిసోన్ క్రీమ్, ఒక శాతం ప్లాసిబో క్రీమ్ ను వారి గాయాలకు మందుగా వాడారు. ఇలా మందు రాసి కట్లు కట్టిన 48 గంటల తర్వాత వచ్చిన ఫలితాలను చూసి డాక్టర్లు ఆశ్చర్యపోయారు. అలోవేరా జెల్ కాలిన గాయాలకు చాలా ప్రభావవంతంగా పని చేసింది. మన శరీరం మీద ఏర్పడిన ఎర్రటి గాయాల మరకలు పూర్తిగా తగ్గిపోయినట్లు వారు గుర్తించారు. ఈ అధ్యయనంలో అలోవేరా జెల్ కాలిన గాయాలను మాన్పించడంలో ప్రతిభావంతంగా పని చేస్తుందని గుర్తించారు.

అలోవేరా జెల్ వలన సూర్యరశ్మి కారణంగా ఏర్పడిన గాయాలు తగ్గుతాయా అని తెలుసుకునేందుకు కేవలం ఒక పరిశోధన మాత్రమే కాకుండా అనేక రకాలుగా స్టడీలు చేశారు. వేరే పరిశోధనలో కూడా అలోవేరా జెల్ వలన సూర్యరశ్మి కారణంగా ఏర్పడిన గాయాలు త్వరగా తగ్గిపోతాయని తేలింది. అందుకోసం సూర్యరశ్మి వలన గాయాలు అయిన వారు అలోవేరా జెల్ ను వాడడం చాలా ఉత్తమం. కాలిన గాయాలకు యాంటీ బయాటిక్స్ వాడడం కంటే అలోవేరా జెల్ ను వాడడం చాలా మంచిదని అనేక పరిశోధనలు తెలుపుతున్నాయి. కేవలం సూర్యరశ్మి వలన ఏర్పడిన గాయాలే కాకుండా అలోవేరా జెల్ వలన అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా అనేక రకాల ప్రయోజనాలు కల అలోవేరా జెల్ ను కొంత మంది డూప్లికేట్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కాబట్టి మనం అలోవేరా జెల్ కొనే ముందు సరిగ్గా చూసుకుని కొనడం మంచిది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్ పేజీను లైక్ చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి

Web Title : effective benefits of aloe vera gel know here all in telugu
Telugu News from Samayam Telugu, TIL Network

Read Entire Article