ఆమె వల్లే అదంతా జరిగింది!.. చెడు ప్రభావం అంటూ నోరు విప్పిన సమంత

2 months ago 57

| Samayam Telugu | Updated: Sep 20, 2021, 9:41 PM

సమంత స్నేహం అంతా కూడా ఇప్పుడు బాలీవుడ్ రేంజ్‌లో ఉంది. తన డిజైనర్ ప్రీతమ్ గురించి అందరికీ తెలిసిందే. ఇక ఈ మధ్య మేకప్ ఆర్టిస్ట్ సాధన సింగ్‌తో మరింత క్లోజ్‌గా ఉంటోంది. ఫ్యామిలీ మెన్ సీజన్ 2 చేసిన సమయంలో ఈమెతో స్నేహం ఏర్పడినట్టుంది.

ఆమె వల్లే అదంతా జరిగింది!.. చెడు ప్రభావం అంటూ నోరు విప్పిన సమంత

ప్రధానాంశాలు:

సోషల్ మీడియాలో సమంత రచ్చతన ఫ్రెండ్ గురించి సామ్ వింత కామెంట్లుచెడు ప్రభావం అంటోన్న సమంత
సమంత స్నేహం అంతా కూడా ఇప్పుడు బాలీవుడ్ రేంజ్‌లో ఉంది. తన డిజైనర్ ప్రీతమ్ గురించి అందరికీ తెలిసిందే. ఇక ఈ మధ్య మేకప్ ఆర్టిస్ట్ సాధన సింగ్‌తో మరింత క్లోజ్‌గా ఉంటోంది. ఫ్యామిలీ మెన్ సీజన్ 2 చేసిన సమయంలో ఈమెతో స్నేహం ఏర్పడినట్టుంది. ఇక అప్పటి నుంచి ఎక్కువగా సాధన, సమంత కలిసే కనిపిస్తున్నారు. ఇక శాకుంతలం సినిమా కూడా సమంత ఆమెనే పెట్టుకున్నట్టుంది. సమంత సోషల్ మీడియాను ఫాలో అయితే.. సాధన సింగ్ గురించి ఎక్కువగా తెలుస్తుంది. సమంత ప్రస్తుతం ఈ గ్యాంగ్‌తోనే ఎక్కువగా ఉంటోంది.

ఇక నిన్న రాత్రి సమంత బాగానే ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తోంది. త్రిష, కీర్తి సురేష్ అంటూ సమంత వారితో కలిసి చెన్నైలో దుమ్ములేపేసింది. అయితే సమంత తన వర్కవుట్లను మాత్రం ఎప్పుడూ మిస్ చేయదు. రోజూ కచ్చితంగా వర్కవుట్లు చేయాల్సిందే. కానీ ఈ రోజు మాత్రం సమంత వర్కవుట్లకు అంతరాయం కలిగిందట. దానికి కారణం తన ఫ్రెండ్ సాధన అంటూ ఫిర్యాదు చేసింది సమంత.

ఎంతో సీరియస్‌గా ప్రారంభించిన నా వర్కవుట్లను మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది.. ఇంకేంటి అక్క.. ఏం జరిగింది.. ఇక నాకు ఈ రోజు ఓ గుణపాఠం తెలిసి వచ్చింది. సాధన సింగ్‌ను ఇక ఎప్పుడూ కూడా జిమ్‌కు తీసుకురావొద్దని తెలిసింది. దారుణంగా బెడిసికొట్టింది. మనలో ఓ ఫ్రెండ్ ఉంటారు.. వారి వల్ల మనపై చెడు ప్రభావం కలుగుతుంది. కానీ వారిని మనం వదులుకోలేం.. వారినే ఎక్కువగా ప్రేమిస్తుంటాం.. మీరు కూడానా? అని సమంత తన స్నేహితురాలు సాధన సింగ్‌ గురించి చెప్పింది.

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్ పేజీను లైక్ చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి

Web Title : samantha akkineni about her friend nature
Telugu News from Samayam Telugu, TIL Network

Read Entire Article