ఆ ఇద్ద‌రిలో నాగార్జున స‌ర‌స‌న న‌టించబోయేదెవ‌రో.. కాజల్‌ను ప‌క్క‌న పెట్టేసిన‌ట్లేనా?

2 months ago 10

| Samayam Telugu | Updated: Sep 20, 2021, 5:46 PM

Nagarjuna Akkineni: నాగార్జున అక్కినేని, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఘోస్ట్ చిత్రంలో కాజల్ స్థానంలో మరో హీరోయిన్‌ను తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

నాగార్జున అక్కినేని

ప్రధానాంశాలు:

నాగార్జున హీరోయిన్ మార్పుకాజల్ స్థానంలో త్రిష లేదా ఇలియానాకాజల్ రీప్లేస్‌కు కారణమదేనా?
సీనియ‌ర్ అగ్ర క‌థానాయ‌కుల్లో ఒకరైన కింగ్ నాగార్జున ఇప్పుడు ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ఘోస్ట్ న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో నాగార్జున రా ఏజెంట్‌గా క‌నిపించ‌బోతున్నారు. పూర్తిస్థాయి యాక్ష‌న్ ప్యాక్డ్ మూవీగా సినిమా తెర‌కెక్క‌నుంది. ఇందులో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుంటే గుల్ ప‌నాగ్‌, అనిఖ సురేంద్ర‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న‌ట్లు మేక‌ర్స్ తెలిపారు. అయితే ఇప్పుడు కాజ‌ల్ ఈ సినిమాలో న‌టించ‌డం లేద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

కాజ‌ల్‌కు ఏమైంది? ఎందుకీ సినిమా వ‌దులుకుంది? అనే అనుమానాలు రావ‌చ్చు. అస‌లు విష‌య‌మేమంటే.. ఇటీవ‌ల కాజ‌ల్, గౌత‌మ్ కిచ్లుని పెళ్లి చేసుకుంది. ఇప్పుడామె ప్రెగ్నెంట్ అని, ఆ కార‌ణంతో సినిమాలో న‌టించ‌డం లేద‌ట‌. దీంతో మేక‌ర్స్ కాజ‌ల్ స్థానంలో మ‌రో హీరోయిన్‌ను తీసుకోవాల‌ని అనుకుంటున్నార‌ట‌. ఇద్ద‌రు పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయ‌ట‌. ముందుగా గోవా బ్యూటీ ఇలియానా పేరు ప‌రిశీల‌న‌లో ఉంది. రేసులో ఉన్న మ‌రో హీరోయిన్ త్రిష‌. వీరిద్ద‌రిలో నాగార్జున‌, ఇలియానా ఇప్ప‌టి వ‌ర‌కు క‌లిసి న‌టించ‌లేదు. నిర్మాత‌లు ఇలియానాకు ఎక్కువ ప్రాధాన్య‌మిస్తున్నార‌ట‌. ఆమె కాదంటే, చెన్నై సొగ‌స‌రి త్రిష‌ను తీసుకోవాల‌నుకుంటున్నార‌ట‌. నాగార్జున‌, త్రిష క‌లిసి ఇది వ‌ర‌కే కింగ్ సినిమాలో న‌టించారు. మ‌రి కాజ‌ల్ స్థానంలో నాగార్జున స‌ర‌స‌న ఇలియానా, త్రిష‌ల్లో న‌టించ‌బోయేదెవ‌రో చూడాలి.

ఇప్పుడీ సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతుంది. రీసెంట్‌గా సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేశారు. శ్రీవెంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకాల‌పై నారాయ‌ణ దాస్ కె.నారంగ్‌, పుస్కూరు రామ్మోహ‌న్‌రావు, శ‌ర‌త్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్ పేజీను లైక్ చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి

Web Title : heroine kajal aggarwal replacing in nagarjuna ghost
Telugu News from Samayam Telugu, TIL Network

Read Entire Article