చిన్న గ్రామంలో కోట్ల రూపాయల భవంతి.. స్టార్ హీరో హీరోయిన్ వినూత్న ఆలోచన! అంత ఖర్చు పెట్టి మరీ..

4 months ago 6

| Samayam Telugu | Updated: Sep 15, 2021, 5:44 PM

ఒక్కొక్కరి లైఫ్ స్టైల్ ఒక్కోలా ఉంటుంది. కొందరు చాలా వినూత్నంగా ఆలోచిస్తుంటారు. సెలబ్రిటీల్లో కూడా అలాంటి డిఫరెంట్ ఆలోచనలు చేసే జోడీలు ఉన్నాయి. అందులో ఒకటే దీపికా పదుకొనే- రణ్‌వీర్ సింగ్ జోడీ.

స్టార్ హీరో హీరోయిన్ వినూత్న ఆలోచన

ఒక్కొక్కరిదీ ఒక్కో ఫ్యాషన్.. ఒక్కొక్కరి లైఫ్ స్టైల్ ఒక్కోలా ఉంటుంది. ఇక సెలబ్రిటీలైతే రంగుల ప్రపంచంలో ఎంతో విలాసవంతమైన లైఫ్ గడుపుతుంటారు. తమ తమ టేస్ట్‌కి తగ్గట్లు కార్లు, బంగ్లాలు కొనుగోలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ క్రేజీ కపుల్ దీపికా పదుకొనే- రణ్‌వీర్ సింగ్ దంపతులు కాస్త వినూత్నంగా ఆలోచించి కోట్ల రూపాయలు వెచ్చించి ఓ ఖరీదైన బంగ్లా కొనుగోలు చేశారట. అది కూడా ఓ చిన్న గ్రామంలో. దీపికా పదుకొనే- రణ్‌వీర్ సింగ్ ఇద్దరూ కూడా తమ తమ సినిమాలతో బిజీగా ఉంటూనే పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటారు. వీలు కుదిరినప్పుడల్లా విదేశాలు చుట్టి వస్తూ సోషల్ మీడియాలో తమ వ్యక్తిగత విషయాలను షేర్ చేస్తుంటారు. క్షణం తీరిక లేకుండా గడిపే ఈ జోడీ.. కాస్త డిఫెరెంట్ ఆలోచనతో మహారాష్ట్రలోని ఓ చిన్న గ్రామంలో ఖరీదైన ఇల్లు కొనుగోలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

అలీబాగ్‌లోని మాప్‌గావ్ అనే గ్రామంలో ఏకంగా 22 కోట్లు పెట్టి విలాసవంతమైన భవనం కొనుగోలు చేశారట పదుకొనే- రణ్‌వీర్ దంపతులు. దాదాపు 9,000 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగి ఉన్న ఈ భవనంలో 5 బెడ్ రూమ్స్ సహా సకల సదుపాయాలు ఉన్నాయని సమాచారం. 2.25 ఎకరాలలో విశాలంగా ఉండి చుట్టూ గ్రీనరీతో ఆహ్లాదకరంగా ఉండేలా నిర్మించారట. సెప్టెంబర్ 13న ఈ ఇంటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా జరిగిందని తెలుస్తోంది. అలీబాగ్‌ ఏరియాలో బాలీవుడ్ సెలబ్రిటీలకు చెందిన ఇండ్లు బాగానే ఉన్నాయి కానీ వాటన్నింటిలో ఇది చాలా ఖరీదైందని, అలాగే ఎంతో ప్రత్యేకమైందని అంటున్నారు.
రాజమౌళి దర్శకత్వంలో మరో భారీ రేంజ్ సినిమా.. జక్కన్నతో మైత్రీ నిర్మాతల స్కెచ్! సర్వం సిద్ధం
ఇక దీపికా సినిమాల విషయానికొస్తే.. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ 'ప్రాజెక్ట్ k' మూవీలో ఆమె నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ స్మస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. సౌత్ బ్లాక్ బస్టర్ మూవీ 'అపరిచితుడు' హిందీ రీమేక్‌లో రణ్‌వీర్ సింగ్ నటిస్తున్నారు.

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్ పేజీను లైక్ చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి

Web Title : deepika padukone buys a luxury house in alibaug
Telugu News from Samayam Telugu, TIL Network

Read Entire Article