జైల్లో అనసూయ!.. మొత్తానికి అలా అడుగుపెట్టేసింది

4 months ago 4

| Samayam Telugu | Updated: Sep 14, 2021, 5:10 PM

అనసూయ భరద్వాజ్ ఇప్పుడు వెండితెరపై ఎన్ని ఆఫర్లు పట్టేసిందో అందరికీ తెలిసిందే. దాదాపు ఆరేడు ప్రాజెక్టుల్లో అనసూయ నటిస్తోంది. ఇందులో పరభాష చిత్రాలే ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక అనసూయ బాలీవుడ్ ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు సమాచారం.

జైల్లో అనసూయ!.. మొత్తానికి అలా అడుగుపెట్టేసింది

ప్రధానాంశాలు:

వరుస ఆఫర్లతో అనసూయ బిజీపుష్పతో మరోసారి రచ్చజైల్ సీన్లలో అనసూయ అలా
అనసూయ భరద్వాజ్ ఇప్పుడు వెండితెరపై ఎన్ని ఆఫర్లు పట్టేసిందో అందరికీ తెలిసిందే. దాదాపు ఆరేడు ప్రాజెక్టుల్లో అనసూయ నటిస్తోంది. ఇందులో పరభాష చిత్రాలే ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక అనసూయ బాలీవుడ్ ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు సమాచారం. తన సినిమా ప్రాజెక్ట్‌ల గురించి చెబుతూ ఆ మధ్య చెప్పిన విశేషాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కోలీవుడ్లోనూ మంచి ఆఫర్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక కేరళలో అయితే ఏకంగా మమ్ముట్టి సరసన నటించే చాన్స్ కొట్టేసింది. పీరియాడిక్ చిత్రమంటూ అందులో పాత్ర బాగుంటుందని అనసూయ చెప్పింది.

ఇక పుష్పలో అయితే మొదటగా అనసూయకు ఎలాంటి పాత్రను సుకుమార్ రాయలేదు. చావు కబురు చల్లగా అనే సినిమా ఈవెంట్‌లో అనసూయ నేరుగా అడిగేసింది. బన్నీతో నటించాలని ఉంది.. నాకు ఓ పాత్రను ఇవ్వండి అని అనసూయ అందరి ముందే అడిగేసింది. అలా మొత్తానికి సుకుమార్ మరో అద్భుతమైన పాత్రను అనసూయ కోసం రాసినట్టు కనిపిస్తోంది.

Anasuya Bharadwaj


ప్రస్తుతం పుష్ప యూనిట్ మారెడుమిల్లి అటవీ ప్రాంతంలో ఉందన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సెట్‌లో అనసూయ కూడా అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. జైలు సీన్లకు సంబంధించిన షూటింగ్ జరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఈ మేరకు అనసూయ ఓ స్టోరీని షేర్ చేసింది. అందులో తాను కనిపించకపోయినా.. జైల్లో ఉన్నట్టుగా సింబాలిక్‌గా చూపించింది. ఇంతకీ ఈ సీక్వెన్స్ పుష్ప సినిమాలోనిదేనా? మరేతర సినిమా కోసం ఇలాంటి పాత్ర చేస్తుందా? అన్నది తెలియాలి.

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్ పేజీను లైక్ చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి

Web Title : anasuya bharadwaj started jail sequence shoot
Telugu News from Samayam Telugu, TIL Network

Read Entire Article