టుడే ఇన్‌స్టా హిట్స్: కూల్ లుక్‌లో రకుల్.. వాణీ హాట్ షో.. బ్యాక్‌ గ్లామర్‌తో ఆకట్టుకుంటున్న లక్ష్మి

1 week ago 7

| Samayam Telugu | Updated: Sep 15, 2021, 9:18 PM

సోషల్‌మీడియాలో సెలబ్రిటీలు ప్రతీ రోజు ఆసక్తికర పోస్టులు చేస్తుంటారు. అలా సెలబ్రటీలు పోస్ట్ చేసిన ఆసక్తికర విషయాలను మీ ముందు ఉంచాలనేదే మా ఈ ప్రయత్నం. ఈ రోజు (సెప్టెంబర్ 15న) సెలబ్రిటీలు పోస్ట్ చేసిన అప్‌డేట్స్ ఏంటో ఓ లుక్ వేయండి.

రకుల్, వాణీ, రాయ్ లక్ష్మి

కూల్ లుక్‌లో నటి రకుల్హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గత కొంతకాలంగా ఆచితూచి సినిమాలు చేస్తోంది. ఈ ఏడాది ‘చెక్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఆమెకు నిరాశే మిగిలింది. ఇక సోషల్‌మీడియాలో ఈ భామకు ఎన్ని పాజిటివ్ కామెంట్స్ వస్తాయో.. అన్ని ట్రోల్స్ వస్తాయి. తాజాగా కళ్లజోడు పెట్టుకొని.. కూల్‌ లుక్‌లో రకుల్ ఓ పిక్‌ని షేర్ చేసింది ఈ భామ.

మనందరం స్టార్స్ అంటున్న సోనాక్షి..

బాలీవుడ్ షాట్‌గన్ శతృజ్ఞ సిన్హా కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నటి సోనాక్షి సిన్హా. సల్మాన్ ఖాన్‌ హీరోగా నటించి ‘దబాంగ్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇక సోషల్‌మీడియాలో సోనాక్షి చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ‘మనందరిలోనూ స్టార్స్ ఉంటాయి.. వాటిని చర్మంతో కప్పేబడుతుంది’ అంటూ ఓ పిక్‌ని షేర్ చేసింది.


అలా పడుకొని.. వాణీ హాట్ షో

నేచురల్ స్టార్ నాని సరసన 'ఆహా కల్యాణం' మూవీలో ఆడిపాడిన బాలీవుడ్ భామ.. వాణీ కపూర్. టైగర్ ష్రాఫ్, హృతిక్ రోషన్ నటించిన 'వార్' సినిమాలో నైనా పాత్రలో అలరించింది. ఇక సోషల్‌మీడియాలో ఈ భామ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఒక సోఫాలో పడుకొని.. తన క్లీవేజ్ చూపిస్తూ.. ఒక పిక్‌ని షేర్ చేసింది వాణీ.


పాపురాలతో కలిసి ఎంజాయ్ చేస్తున్న రేణు

ప్రముఖ నటి.. రేణు దేశాయ్.. పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌తో విడాకులు జరిగినప్పటికీ.. ఆమె ఒంటరి మహిళగానే జీవనం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం హాలీడేలను ఎంజాయ్ చేస్తున్నారు. త్వరలో తన కుమారుడు అకీరాను హీరోగా పరిచయం చేయాలని ఆమె ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఓ రిసార్ట్‌లో కూర్చొని.. చుట్టు కాకులు, పాపురాలతో చర్చ చేస్తున్నాను అంటూ ఓ పిక్ షేర్ చేశారు రేణు.


బ్యాక్ గ్లామర్ చూపిస్తున్న లక్ష్మి

‘కాంచన’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన బ్యూటీ రాయ్ లక్ష్మి. ఆ తర్వాత కూడా ఆమె తమిళంలో సినిమాలు చేస్తూ.. అవి తెలుగులో డబ్బింగ్ కావడంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. చాలాకాలంగా వెండితెరపై కనిపించని ఈ బ్యూటీ సోషల్‌మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా తన బ్యాక్ గ్లామర్ చూపిస్తూ పిక్స్ షేర్ చేసింది లక్ష్మి.

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్ పేజీను లైక్ చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి

Web Title : social media round up about rakul vaani and laxmi
Telugu News from Samayam Telugu, TIL Network

Read Entire Article