టుడే ఇన్‌స్టా హిట్స్: బ్లాక్‌ బ్యూటీ నివేధా.. ప్రకృతి మధ్య కత్రినా ఎంజాయ్.. చూస్తున్నా అంటూ అమలా

4 months ago 8

| Samayam Telugu | Updated: Sep 16, 2021, 7:46 PM

సోషల్‌మీడియాలో సెలబ్రిటీలు ప్రతీ రోజు ఆసక్తికర పోస్టులు చేస్తుంటారు. అలా సెలబ్రటీలు పోస్ట్ చేసిన ఆసక్తికర విషయాలను మీ ముందు ఉంచాలనేదే మా ఈ ప్రయత్నం. ఈ రోజు (సెప్టెంబర్ 16న) సెలబ్రిటీలు పోస్ట్ చేసిన అప్‌డేట్స్ ఏంటో ఓ లుక్ వేయండి.

నివేధా, కత్రినా, అమలా

బ్లాక్‌ బ్యూటీ నివేధాకోలీవుడ్‌లో పలు సినిమాలు చేస్తూ.. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ నివేధా పేతురాజ్. పలు సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌ పాత్రల్లో నటించిన ఆమె.. రీసెంట్‌గా పాగల్ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. ఇక సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తాజాగా బ్లాక్ డ్రెస్‌లో కొన్ని పిక్స్ దిగి వాటిని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది.

హాట్ పోజ్‌లో అలరిస్తున్న లావణ్య

‘అందాల రాక్షసి’ లావణ్య త్రిపాఠి సోషల్‌మీడియాలో ఏ రేంజ్‌లో యాక్టివ్‌గా ఉంటుందో అందరికి తెలిసిందే. తనకు సంబంధించిన విషయాలను ఆమె ఎప్పటికప్పుడు సోషల్‌మీడియా ద్వారా అభిమానులకు చేరవేస్తుంటుంది. ఇక తరచూ ఫోటోషూట్‌లు చేస్తూ.. ఆ పిక్స్‌ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా హాట్ పోజ్‌లో కొన్ని పిక్స్‌ దిగి వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది ఈ భామ.


ప్రకృతి మధ్య కత్రినా ఎంజాయ్

బాలీవుడ్ హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్‌హిట్ సినిమాల్లో నటించి.. ప్రేక్షకుల మనస్సులో చిరస్థాయిలో స్థానం సంపాదించుకుంది. ఇక సోషల్‌మీడియాలో కూడా ఈ భామ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా చుట్టు చెట్ల మధ్యలో ఎంజాయ్ చేస్తూ.. కొన్ని పిక్స్‌ని పంచుకుంది కత్రినా.

నారింజ పండులా మెరిసిపోతున్న ప్రియాంక

‘టాక్సివాలా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటి ప్రియాంక జవాల్కర్. రీసెంట్‌గానే ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఈ సుందరి.. త్వరలో ‘గమనం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నారింజ రంగు దుస్తుల్లో మెరిసిపోతూ.. కొన్ని పిక్స్‌ని షేర్ చేసింది ప్రియాంక.


మిమ్మల్నే చూస్తున్నాను అంటున్న అమలా..

తెలుగు, తమిళం సినిమాల్లో నటిస్తూ.. ఇరు ఇండస్ట్రీల్లో అభిమానుల్ని సంపాదించుకుంది నటి అమలా పాల్. కొద్ది రోజుల క్రితమే కుడి ఎడమైతే అనే వెబ్‌సిరీస్‌తో మంచి సక్సెస్ అందుకున్న ఈ సుందరి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న అమలా సోషల్‌మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఓర చూపులతో.. మిమ్మల్నే చూస్తున్నాను అంటూ ఓ పిక్ పోస్ట్ చేసింది అమలా.


Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్ పేజీను లైక్ చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి

Web Title : social media round up about nivetha katrina and amala
Telugu News from Samayam Telugu, TIL Network

Read Entire Article