తన అందానికి రహస్యం పాము రక్తామా..? సీనియర్ హీరో అనిల్ కపూర్ రియాక్షన్ ఇదే..

4 months ago 6

| Samayam Telugu | Updated: Sep 15, 2021, 10:37 PM

బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ ఇప్పటికే ఎంత ఫిట్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. అయితే తాజాగా ఓ షోలో పాల్గొన్న ఆయన.. తన గ్లామర్ సీక్రెట్‌ను బయటపెట్టారు. తన అందానికి పాము రక్తం తాగడమే కారణమా అని అడిగిన ప్రశ్నకు ఆయన ఆసక్తికరంగా రియాక్ట్ అయ్యారు.

అనిల్ కపూర్

బాలీవుడ్ సీనియర్ నటుల్లో అనిల్ కపూర్ స్టైల్ వేరు. 100కుపైగా సినిమాల్లో నటించిన ఆయన.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నటించిన.. పలు సినిమాలు ఇప్పటికీ ట్రెండ్ సెట్టర్లుగానే ఉన్నాయి. అయితే ఆరు పదుల వయస్సు దాటినప్పటికీ.. అనిల్ కపూర్ మాత్రం అదే అందాన్ని మెయింటేన్‌‌ చేస్తున్నారు. అయితే ఆయన గ్లామర్ సీక్రెట్‌పై ఇప్పటికే అభిమానుల్లో పలు అనుమానాలు ఉన్నాయి. అంత ఫిట్‌గా ఉండేందుకు అనిల్ ఏం చేస్తారు అంటూ తరచూ అభిమానులు ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. అసలు అనిల్ ఫిట్‌నెస్ చూస్తే.. ఇప్పటి కుర్ర హీరోలు కూడా దిగదుడుపే అనిపిస్తారు. అంతలా కండలు తిరిగిన శరీరంతో ఆయన యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తుంటారు. ఈ మధ్యకాలంలో అయితే.. ఆయన మరింత స్టైలిష్‌గా మారిపోయారు. అయితే తాజాగా మరో బాలీవుడ్ హీరో అర్బాజ్ ఖాన్ నిర్వహించే టాక్ షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన ఫిట్‌నెస్‌కి సంబంధించి పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు నటుడు అనిల్ కపూర్. ఈ షోలో అనిల్ కపూర్‌ ఫిట్‌సెస్ సీక్రెట్స్ తెలుసుకొనేందుకు అభిమానులు అడిగిన ప్రశ్నలను వినిపించారు అర్భాజ్.

అందులో ప్రధానంగా ‘మీరు ఇందత అందంగా ఉండటానికి కారణం పాము రక్తం తాగటమే కదా’ అంటూ ఓ అభిమాని ప్రశ్నించాడు. మరొకరు ‘మీరు ఎప్పుడు ఓ ప్లాస్టిక్ సర్జన్‌ని మీతోనే ఉంచుకుంటారట కదా’అంటూ అడిగాడు. ఈ ప్రశ్నలు విని.. అనిల్ కపూర్ షాక్ అయ్యారు. వాళ్లు నిజంగానే అడిగారా.. లేక మీరు డబ్బులు ఇచ్చి పెట్టించారా అంటూ ఆయన జోక్ చేశారు. ఆ తర్వాత తన ఫిట్‌నెస్ సీక్రెట్‌ని ఆయన బయటపెట్టారు. ప్రతి రోజు వ్యాయామం చేయడం.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడమే తను ఇలా ఉండటానికి కారణమని ఆయన అన్నారు. రోజులో 24 గంటలు ఉంటే కనీసం ఒక గంట అయినా.. మన శరీరం కోసం.. ఆరోగ్యం కోసం కేటాయించకపోతే ఎందుకు అంటూ ఆయన పేర్కొన్నారు.

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్ పేజీను లైక్ చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి

Web Title : anil kapoor reacts to trolls who said he drinks snake blood
Telugu News from Samayam Telugu, TIL Network

Read Entire Article