తాలిబన్లకు ఆశ్రయమిచ్చిన పాక్‌తో సంబంధాలపై పునరాలోచిస్తాం.. అమెరికా కీలక వ్యాఖ్యలు

4 months ago 14

| Samayam Telugu | Updated: Sep 14, 2021, 11:35 AM

గత 20 ఏళ్లలో అమెరికా సైన్యం పోరాటాలు చేస్తుంటే.. అఫ్గన్‌లో తాలిబన్ల దాడులకు పాకిస్థాన్ సహకరించినట్టు తాజా పరిణామాలతో బహిర్గతమయ్యిందని అమెరికా వ్యాఖ్యానించింది.

ఆంటోనీ బ్లింకేన్

ప్రధానాంశాలు:

తాలిబన్ ఉగ్రవాదులకు పాకిస్థాన్ ఆశ్రయం.అమెరికా విదేశీ వ్యవహారాల కమిటీలో చర్చ.అఫ్గన్ భవిష్యత్తు కోసం త్వరలో కార్యాచరణ.
అఫ్గనిస్థాన్ విషయంలో అమెరికా అనుసరించాల్సిన వ్యూహం.. భవిష్యత్తుల్లో ఎటువంటి పాత్ర పోషించాలనుకుంటుందో త్వరలోనే వెల్లడిస్తామని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకేన్ అన్నారు. అలాగే, రాబోయే వారాల్లో పాకిస్థాన్‌తో సంబంధాల విషయమై పునరాలోచిస్తామని వ్యాఖ్యానించారు. అఫ్గనిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత తొలిసారిగా అమెరికా కాంగ్రెస్‌లో తొలిసారిగా ఈ అంశంపై సోమవారం చర్చ జరిగింది. అఫ్గన్ వ్యవహారంలో అమెరికా ఆకాంక్షలకు వ్యతిరేకంగా పాక్ పనిచేస్తోందని ప్రతినిధుల సభ విదేశీ వ్యవహారాల కమిటీ ముందు వెల్లడించారు.

‘అఫ్గన్ భవిష్యత్తు విషయంలో పాక్ నిరంతరం ఆటంకాలు కల్పించింది.. అందులో తాలిబాన్ సభ్యులకు ఆశ్రయం కల్పించడం... ఉగ్రవాద వ్యతిరేక పోరాటానికి సంబంధించిన అంశాల సహకారంలో ఇది కూడా ఒకటి’ అని బ్లింకేన్ అన్నారు. పాక్‌తో సంబంధాలను పునఃసమీక్షించాల్సిన సమయం వచ్చిందని కమిటీ సభ్యులు వ్యాఖ్యానించగా.. దీనిపై యంత్రాంగం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

‘గత 20 ఏళ్లుగా పాక్ పోషించిన పాత్ర కానీ, రాబోయే సంవత్సరాల్లో మనం పోషించాలనుకునే పాత్ర ఏమిటి అనేది ఈ రోజున, రాబోయే వారాలలో మనం చూడబోతున్న విషయాలలో ఇది ఒకటి.. ’ అన్నారు. అఫ్గన్‌లో 20 ఏళ్ల పోరాటానికి స్వస్తిపలికిన అమెరికా.. సైన్యాలను పూర్తిగా ఉపసంహరించుకుంది. దీంతో మళ్లీ తాలిబన్లు పాగా వేశారు.

అఫ్గన్ నుంచి అమెరికా, నాటో బలగాలను తరలిస్తుండగా కాబూల్ విమానాశ్రయంలో ఐఎస్-కే ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 13 మంది అమెరికా సైనికులు సహా దాదాపు 200 మంది ప్రాణాలు కోల్పోయారు. తాలిబన్ విజయాన్ని గుర్తించే విషయంలో అమెరికా, పశ్చిమ దేశాలు ఆచితూచి అడుగులేస్తున్నాయి. ఇదే సమయంలో పాకిస్థాన్ మాత్రం తాలిబన్లతో బలంగా పెనువేసుకుపోతోంది. గత 20 ఏళ్లుగా అఫ్గన్‌లో తాలిబన్ మూకలకు పాకిస్థాన్ సహకారం అందించిందనడానికే తాజా పరిణామాలే సాక్ష్యం.

గతంలో ఈ ప్రచారాన్ని పాక్ తోసిపుచ్చినా.. ప్రస్తుతం తాలిబన్ తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటులో పాక్ కీలక భూమిక పోషించింది. అఫ్గన్‌లో అమెరికా సైన్యం అడుగుపెట్టిన తర్వాత తాలిబన్లకు పాకిస్థాన్, ఖతార్‌ల నుంచి పూర్తి సహకారం అందింది.

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్ పేజీను లైక్ చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి

Web Title : pakistan involved in harbouring members of taliban says us
Telugu News from Samayam Telugu, TIL Network

Read Entire Article