ప్ర‌భాస్ ముందే యాట్యిట్యూడ్‌.. పూజా హెగ్డేను క‌ట్ చేసిన ప‌క్క‌న పెట్టేశార‌ట‌గా!

4 months ago 17

| Samayam Telugu | Updated: Sep 15, 2021, 6:03 PM

Prabhas - Pooja Hegde: యూర‌ప్‌లో పూజా హెగ్డే త‌నో స్టార్ హీరోయిన్ అనే యాట్యిట్యూడ్ చూపించ‌డంతో హీరో ప్ర‌భాస్ ఆమెతో క‌లిసి న‌టించ‌డానికి ఆస‌క్తి చూపించ‌లేదు. దీంతో మేక‌ర్స్ మిగిలి చిత్రీక‌ర‌ణ‌ను మేనేజ్ చేస్తూ పూర్తి కానిచ్చేశార‌ని టాక్‌.

ప్రభాస్ - పూజాహెగ్డే

ప్రధానాంశాలు:

ప్రభాస్, పూజా హెగ్డే మధ్య క్లాషెస్పూజా హెగ్డేను దూరం పెట్టేసిన ప్రబాస్నిర్మాణానంతర కార్యక్రమాల్లో ‘రాధేశ్యామ్’
హీరో సెంట్రిక్ సినీ ఇండ‌స్ట్రీల్లో టాలీవుడ్ ముందుంటుంది. ఇక్క‌డ హీరోల‌కు ఇచ్చే ప్రాధాన్య‌త మ‌రే ఇండ‌స్ట్రీలో క‌నిపించ‌దు. అందుకు నిర్మాత‌లకు కూడా కార‌ణాలుంటాయి. బాహుబ‌లి వంటి చిత్రంతో తెలుగు సినిమా రేంజ్‌ను పెంచిన ప్ర‌భాస్‌కు ఎలాంటి ఇంపార్టెన్స్ ఇస్తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అలాంటి హీరో ముందు ఎవ‌రైనా యాట్యిట్యూడ్ చూపిస్తే కామ్‌గా ఉంటారా? సీన్ రివ‌ర్సే. ఇప్పుడు స్టార్ హీరోయిన్ పూజాహెగ్డేకు అలాంటి ప‌రిస్థితే ఎదురైంద‌ని సినీ ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఇంత‌కీ ప్ర‌భాస్‌కు, పూజాహెగ్డేకు ఏమైంద‌నే వివ‌రాల్లోకెళ్తే.. వీరిద్ద‌రూ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ‘రాధేశ్యామ్‌’. పీరియాడిక్ ల‌వ్‌స్టోరి ఇది. యూర‌ప్‌లో కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. ఈ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌లో పూజాహెగ్డే తానొక స్టార్ హీరోయిన్ అనేలా ప్ర‌భాస్ ముందే బిల్డ‌ప్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింద‌ట‌. బేసిగ్గా అంద‌రితో కూల్‌గా ఉండే డార్లింగ్ ఈ విష‌యంలో హర్ట్ అయ్యార‌ట‌. అస‌లే సినిమాను చేస్తుంది యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్... ఇంకేముంది, ప్ర‌భాస్‌..పూజాహెగ్డేతో క‌లిసి న‌టించ‌న‌ని చెప్పేశాడు. పాన్ ఇండియా ప్రాజెక్ట్, క్యాన్సిల్ చేయ‌లేరు. దీంతో హీరో, హీరోయిన్ మ‌ధ్య ఉండే క్లోజ్డ్ సీన్స్‌ను ప్ర‌భాస్ డూప్‌, పూజా హెగ్డేతో చిత్రీక‌రించార‌ని, సాంగ్ అయితే గ్రాఫిక్స్‌లో మేనేజ్ చేశార‌ని టాక్ వినిపిస్తోంది.

మ‌రి ఇందులో నిజా నిజాలేంట‌నే దానిపై చిత్ర యూనిట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మ‌రి. రాధాకృష్ణ‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న రాధేశ్యామ్ నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకునే ప‌నిలో బిజీగా ఉంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ ఓ కొలిక్కి వ‌చ్చాక‌నే ‘రాధేశ్యామ్‌’ రిలీజ్ డేట్ గురించి నిర్మాత‌లు అధికారిక ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంది.

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్ పేజీను లైక్ చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి

Web Title : prabhas did not act with pooja hegde in radhe shyam after europe schedule
Telugu News from Samayam Telugu, TIL Network

Read Entire Article