బాలయ్య బాబు 'రౌడీయిజం'.. హాట్ బ్యూటీలతో నందమూరి నటసింహం! భలే స్కెచ్చేశారే..

1 week ago 1

| Samayam Telugu | Updated: Sep 15, 2021, 1:53 PM

ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్‌టైనర్ 'అఖండ' మూవీ కంప్లీట్ చేసే పనిలో ఉన్న బాలకృష్ణ.. తన తదుపరి సినిమా కోసం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఈ సినిమా కోసం 'రౌడీయిజం' అనే టైటిల్ ఫిక్స్ చేశారట.

బాలయ్య బాబు 'రౌడీయిజం'.. హాట్ బ్యూటీలతో నందమూరి నటసింహం!

సీనియర్ హీరోగా తెలుగు తెరపై సత్తా చాటుతున్నారు బాలకృష్ణ. వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా బిజీగా ఉంటూనే కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్‌టైనర్ 'అఖండ' మూవీ కంప్లీట్ చేసే పనిలో ఉన్న నందమూరి నటసింహం.. తన తదుపరి సినిమా కోసం పక్కా ప్రణాళికతో ముందుకెళ్లబోతున్నారట. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్ నెట్టింట వైరల్ అవుతోంది.ఇటీవలే రవితేజ హీరోగా 'క్రాక్' సినిమాతో మాస్ ఆడియన్స్‌లో ఊపు తెప్పించిన గోపీచంద్ మలినేని ఈ సారి మరింత పవర్‌ఫుల్ స్టోరీ రెడీ చేసి బాలయ్యను రంగంలోకి దించబోతున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ డెవెలప్ చేసే పనిలో ఉన్న ఆయన త్వరలోనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారు. భారీ యాక్షన్ మూవీగా ప్రేక్షకుల్లో ఊపు తెప్పించేలా ఈ సినిమా ఉండాలని భావిస్తున్న డైరెక్టర్.. ఇందుకోసం 'రౌడీయిజం' అనే పవర్‌ఫుల్ టైటిల్ రిజిస్టర్ చేసుకున్నారనేది లేటెస్ట్ టాక్.
Most Eligible Bachelor: లెహరాయి సాంగ్.. పూజా హెగ్డేతో అఖిల్ రొమాన్స్ పీక్స్
ఇక ఈ భారీ సినిమా కోసం నటీనటుల ఎంపికపై స్పెషల్ ఫోకస్ పెట్టిన గోపీచంద్ మలినేని.. హీరోయిన్స్ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీలో హీరోయిన్‌గా త్రిష నటించనుందని వార్తలు వస్తుండగా, తాజాగా అదే నిజం అనే టాక్ బలంగా వినిపిస్తోంది. అదేవిధంగా మరో హీరోయిన్‌గా గోవా బ్యూటీ ఇలియానాను తీసుకుంటున్నారట. ఇప్పటికే ఈ ఇద్దరితో సంప్రదింపులు కూడా ఫినిష్ అయ్యాయని, బాలయ్య బాబుతో రొమాన్స్ చేసేందుకు ఈ హాట్ బ్యూటీలు ఓకే అనేశారని సమాచారం. మొత్తానికైతే బాలయ్య కోసం గోపీచంద్ మలినేని చేస్తున్న ప్లాన్స్ నందమూరి అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి.

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్ పేజీను లైక్ చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి

Web Title : crazy title fix for nandamuri balakrishna- gopichand malineni movie
Telugu News from Samayam Telugu, TIL Network

Read Entire Article