బాల‌కృష్ణ ప్లాప్ మూవీ టైటిల్‌తో బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్‌..!

4 months ago 12

| Samayam Telugu | Updated: Sep 16, 2021, 9:36 AM

Shahrukh Khan - Atlee:బాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో ఒకరైన షారూక్ ఖాన్ ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి టైటిల్‌ను ఖ‌రారు చేసిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

షారూక్ ఖాన్ - అట్లీ

ప్రధానాంశాలు:

షారూక్ ఖాన్, అట్లీ చిత్రానికి టైటిల్ ఖరారుబాలకృష్ణ ప్లాప్ మూవీ టైటిల్ పెట్టిన అట్లీచిత్రీకరణ దశలో షారూక్-అట్లీ మూవీ
బాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుల్లో ఒక‌రైన షారూక్‌ఖాన్ సినిమా వ‌చ్చి మూడేళ్ల‌వుతుంది. జీరో త‌ర్వాత ఆయ‌న సిల్వ‌ర్ స్క్రీన్‌పై అభిమానుల‌ను అల‌రించలేదు. అయితే ఇప్పుడు ఏకంగా రెండు సినిమాల‌ను ట్రాక్ ఎక్కించేశాడు. అందులో ఒక‌టి ప‌ఠాన్ చిత్రం. సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోంది. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉండ‌గానే అట్లీ డైరెక్ష‌న్‌లో మ‌రో సినిమాను రీసెంట్‌గానే షురూ చేశాడు బాద్‌షా. పుణే ప‌రిస‌ర ప్రాంతాల్లో షూటింగ్ సాగుతోంది. తాజా చిత్రం ప్ర‌కారం ఈ సినిమాకు ల‌య‌న్ అనే ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌ను షారూక్‌-అట్లీ ఫిక్స్ చేశారు. కానీ అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

ఈ సినిమాను షారూక్ ఖాన్ పాన్ ఇండియా రేంజ్‌లో విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేసుకున్నాడు. అందుక‌నే ద‌ర్శ‌కుడు అట్లీని తీసుకున్నాడు. అంతే కాదండోయ్ హీరోయిన్స్‌గా కూడా సౌత్ హీరోయిన్స్‌కే ప్రాధాన్యం ఇచ్చాడు. న‌య‌న‌తార‌, ప్రియ‌మ‌ణి హీరోయిన్స్‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇదంతా బాగానే ఉంది కానీ.. ఇలాంటి టైటిల్‌తో తెలుగులో ఆల్ రెడీ ఓ సినిమా వ‌చ్చేసింది. చేసిందెవ‌రో చెప్ప‌న‌క్క‌ర్లేదు. నంద‌మూరి బాల‌కృష్ణ‌. స‌త్య‌దేవ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం 2015లో విడుద‌లై అనుకున్న రేంజ్‌లో స‌క్సెస్ సాధించ‌లేదు.

ఇప్పుడు అలాంటి ప్లాప్ మూవీ టైటిల్‌నే అట్లీ త‌న సినిమాకు పెట్టుకున్నాడు. స్టోరి డిమాండ్ మేర‌కు అట్లీ ఈ టైటిల్‌ను పెట్టుకుని ఉండొచ్చు. ఇప్ప‌టి వ‌ర‌కు అట్లీ తెర‌కెక్కించిన సినిమా టైటిల్స్‌ను ప‌రిశీలిస్తే ఇదే ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్ అన‌డంలో సందేహం లేదు. మ‌రి ఈ సినిమా జోన‌ర్ ఏంటి? షారూక్ పాత్ర‌ను అట్లీ ఎంత ప‌వ‌ర్‌ఫుల్‌గా చూపించ‌బోతున్నాడ‌నేది అంద‌రిలోనూ ఆస‌క్తిని రేపుతోంది.

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్ పేజీను లైక్ చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి

Web Title : bala krishna flop movie title for shahrukh khan atlee movie
Telugu News from Samayam Telugu, TIL Network

Read Entire Article