బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాపై లేటెస్ట్ అప్‌డేట్.. ఆయనతో జోడీ కట్టనున్న బాలీవుడ్ బ్యూటీ

4 months ago 35

| Samayam Telugu | Updated: Sep 16, 2021, 4:48 PM

టాలీవుడ్‌లో పలు సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించిన బెల్లంకొండ శ్రీనివాస్.. త్వరలో బాలీవుడ్‌లో అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ఛత్రపతి సినిమా రీమేక్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఆయనకు లేటెస్ట్‌గా హీరోయిన్‌గా బాలీవుడ్ భామ సెట్ అయిందట.

బెల్లంకొండ శ్రీనివాస్

‘అల్లుడు శీను’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు స్టార్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేశ్ కుమారుడు బెల్లంకొడ శ్రీనివాస్. తొలి సినిమా కాస్త ఫర్వాలేదు అనిపించినా.. ఆ తర్వాత వచ్చిన సినిమాలేవీ అతనికి మంచి సక్సెస్‌ని అందించలేకపోయాయి. కెరీర్ ఆరంభం నుంచి స్టార్ దర్శకులు, టాప్ హీరోయిన్లతో సినిమాలు చేస్తూ వచ్చాడు శ్రీనివాస్. సమంత, కాజల్, తమన్నా, మెహ్రీన్, పూజా హెగ్డే ఇలా ఏ హీరోయిన్‌తో సినిమాలు చేసిన ఫలితం మాత్రం అదే రిపీట్ అయింది. ఇక ఆయన సినిమాకు దర్శకత్వం వహించిన వాళ్లు కూడా అంతా టాప్ డైరెక్టర్లే అయినా కూడా ఇప్పటికీ సరైన హిట్ పడలేదు. దీంతో టాలీవుడ్‌కు కాస్త గ్యాప్ ఇచ్చి బాలీవుడ్‌పై దృష్టిపెట్టాడు.. ఈ బెల్లంకొండ హీరో. 2005లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఛత్రపతి’ సినిమాను ఆయన హిందీలో రీమేక్ చేస్తున్నారు. పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాను హిందీలో వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మధ్యకాలంలోనే ఈ సినిమా హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభం అయింది. రాజమౌళి స్వయంగా వచ్చి.. క్లాప్ కొట్టి మొదటి సీన్‌కు దర్శకత్వం వహించారు. అయితే అప్పట్లో హైదరాబాద్‌లో భారీగా వర్షాలు కురవడంతో సినిమా షూటింగ్‌కు అంతరాయం ఏర్పడింది.

అయితే ఈ సినిమాలో నటించే హీరోయిన్ విషయంపై మొదటి నుంచి సందగ్ధత నెలకొంటునే ఉంది. సినిమా అనుకున్నప్పటి నుంచి బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లుగా ఉన్న.. ఆలియా భట్, కియారా అడ్వాణీ, దిశా పటాని, శ్రద్ధా కపూర్‌లను ఈ సినిమా కోసం అడిగారని. కానీ, వీరెవరూ కూడా ఈ సినిమాలో చేసేందుకు ఓకే చేయలేదు అని వార్తలు అప్పట్లో వైరల్ అయ్యాయి. అయితే కొద్ది రోజుల క్రితం ఈ సినిమాలో నటించేందుకు హీరోయిన్ రెజీనా కస్సాండ్రా ఓకే అన్నారు అని ఓ వార్త బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో ఫైనల్‌గా హీరోయిన్ ఈవిడే అంటూ మరో న్యూస్ వైరల్ అవుతోంది. బాలీవుడ్ హాట్ బ్యూటీ సుస్రత్ బరుచాను ఈ సినిమాలో హీరోయిన్‌గా ఫిక్స్ చేశారనే మాట బలంగా వినిపిస్తోంది. మరి దీనిపై క్లారిటీ రావాలి అంటూ సినిమా యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఆగాల్సిందే.

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్ పేజీను లైక్ చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి

Web Title : nushrratt bharuccha to act in hindi chatrapathi remake
Telugu News from Samayam Telugu, TIL Network

Read Entire Article