భీమ్లా నాయక్ అప్డేట్.. యాటిట్యూడ్ కా బాప్.. అదరగొట్టేసిన రానా

2 months ago 15

| Samayam Telugu | Updated: Sep 20, 2021, 6:07 PM

భీమ్లా నాయక్ సినిమా మీద టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. మళయాలంలో వచ్చిన అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రానికి రీమేక్‌గా తెలుగులో భీమ్లా నాయక్ అంటూ రాబోతోంది.

భీమ్లా నాయక్ అప్డేట్.. డేనియల్ శేఖర్ వచ్చేశాడు

ప్రధానాంశాలు:

భీమ్లా నాయక్ అప్డేట్రానా సమయం వచ్చేసింది ఇకడేనియల్ శేఖర్ రచ్చ షురూ
భీమ్లా నాయక్ సినిమా మీద టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. మళయాలంలో వచ్చిన అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రానికి రీమేక్‌గా తెలుగులో భీమ్లా నాయక్ అంటూ రాబోతోంది. ఇక ఇందులో రెండు పవర్ ఫుల్ పాత్రల మధ్య వచ్చే సీన్స్ మాస్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంటాయి. అయితే తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా చాలానే మార్పులు చేర్పులు చేసినట్టు కనిపిస్తోంది. అక్కడ టైటిల్‌లో రెండు పాత్రలకు సమన్యాయం చేశారు. కానీ తెలుగులో మాత్రం పవన్ కళ్యాణ్ పాత్ర పేరు టైటిల్‌గా పెట్టేశారు.

భీమ్లా నాయక్ అంటూ వదిలిన ఫస్ట్ గ్లింప్స్‌లో పవన్ కళ్యాణ్ రెచ్చిపోయాడు. రేయ్ డానీ నా కొడక అంటూ పవన్ కళ్యాణ్ ఆవేశంతో ఊగిపోయిన షాట్, రౌడీలను చితక్కొడుతూ లుంగీలో వచ్చే సీన్‌కు అభిమానులు ఫిదా అయ్యారు. అయితే ఇప్పుడు ఇక డానియల్ శేఖర్‌గా రానా విశ్వరూపం చూసే సమయం వచ్చింది. కాసేపటి క్రితమే డానియల్ శేఖర్‌ను చిత్రయూనిట్ పరిచయం చేసింది.


నీ మొగుడు గబ్బర్ సింగ్ అంట కదా? స్టేషన్‌లో టాక్.. నేను ధర్మేంద్ర.. హీరో.. డేనియల్ శేఖర్ ఎంటర్టైన్మెంట్.. ప్రొడక్షన్ నెంబర్ వన్ అంటూ రానా పాత్రకు సంబంధించిన వీడియోను వదిలారు. అందులో రానా పొగరు, యాటిట్యూడ్ అన్నీ కూడా హైలెట్ అయ్యేలా ఉన్నాయి. ఈ చిత్రానికి స్క్రిప్ట్‌ను త్రివిక్రమ్ అందించగా.. సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో నిత్యా మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దిగనుంది.

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్ పేజీను లైక్ చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి

Web Title : blitz of daniel shekar from rana pawan kalyan bheemla nayak
Telugu News from Samayam Telugu, TIL Network

Read Entire Article