భీమ్లా నాయక్ : లుంగీలో అదరగొట్టేశావ్ బ్రో.. రానాపై పృథ్వీరాజ్

2 months ago 11

| Samayam Telugu | Updated: Sep 20, 2021, 8:38 PM

అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాలో బిజూ మీనన్, పృథ్వీరాజ్ సుకుమారన్ నటనే ప్రధానం. అయ్యప్పన్ నాయర్‌గా బిజూ మీనన్, కోషి కురియన్ పాత్రలో పృథ్వీరాజ్ ఒకరిని మించి మరొకరు నటించేశారు.

లుంగీలో అదరగొట్టేశావ్ బ్రో.. రానాపై పృథ్వీరాజ్

ప్రధానాంశాలు:

భీమ్లా నాయక్ అప్డేట్డేనియల్ శేఖర్ వీడియో వైరల్రానా నటనపై పృథ్వీరాజ్ సుకుమారన్
అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాలో బిజూ మీనన్, పృథ్వీరాజ్ సుకుమారన్ నటనే ప్రధానం. అయ్యప్పన్ నాయర్‌గా బిజూ మీనన్, కోషి కురియన్ పాత్రలో పృథ్వీరాజ్ ఒకరిని మించి మరొకరు నటించేశారు. ఇద్దరు ఇగో ఉన్న మనుషులు ఢీ కొడితే ఎలా ఉంటుందో ఆ చిత్రంలో చూడొచ్చు. ఏ ఒక్కరూ కూడా వెనక్కి తగ్గరు. అలాంటి పాత్రల్లో ఆ ఇద్దరూ జీవించేశారు. ఇప్పుడు ఆ సినిమానే తెలుగులోకి భీమ్లా నాయక్ అంటూ రీమేక్ చేస్తున్నారు. టైటిల్‌లోనే ఓ పాత్రకు అన్యాయం చేసేశారు. పవన్ కళ్యాణ్ పాత్ర పేరునే సినిమాకు టైటిల్‌గా పెట్టి.. రానా పాత్ర గాలి తీసేశారనే టాక్ వచ్చింది.

భీమ్లా నాయక్ అంటూ వదిలిన ఫస్ట్ గ్లింప్స్‌లో పవన్ కళ్యాణ్ రెచ్చిపోయాడు. రేయ్ డానీ నా కొడక అంటూ పవన్ కళ్యాణ్ ఆవేశంతో ఊగిపోయిన షాట్, రౌడీలను చితక్కొడుతూ లుంగీలో వచ్చే సీన్‌కు అభిమానులు ఫిదా అయ్యారు. అయితే ఇప్పుడు ఇక డానియల్ శేఖర్‌గా రానా విశ్వరూపం చూపించేశాడు. కాసేపటి క్రితమే డానియల్ శేఖర్‌ యాటిట్యూడ్, పొగరును అందరూ చూశారు.

నీ మొగుడు గబ్బర్ సింగ్ అంట కదా? స్టేషన్‌లో టాక్.. నేను ధర్మేంద్ర.. హీరో.. డేనియల్ శేఖర్ ఎంటర్టైన్మెంట్.. ప్రొడక్షన్ నెంబర్ వన్ అంటూ డేనియల్ శేఖర్‌గా రానా అదరగొట్టేశాడు. అయితే మాతృకలో ఈపాత్రను పోషించిన పృథ్వీరాజ్ ఈ వీడియోను విడుదల చేశాడు. ఈ మేరకు ఆయన చేసిన కామెంట్లు కూడా వైరల్ అవుతున్నాయి.

‘అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమా నాకు ఎంతో ప్రత్యేకం. మరీ ముఖ్యంగా కోషి కురియన్ పాత్ర అయితే నా కెరీర్‌లో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఆ క్యారెక్టర్‌ను పోషించడం నాకు ఎంతో గర్వకారణం. డైరెక్టర్ సాచి, నేను ఇద్దరం ఈ మూవీ రీమేక్ గురించి మాట్లాడుకునే వాళ్లం. కానీ ఇలా తెలుగులో పెద్ద స్టార్లు, లెజెండ్ అయిన పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ సర్, రవి కే చంద్రన్ వంటి వారు రీమేక్ చేస్తారని అనుకోలేదు. ఇది కచ్చితంగా అద్బుతంగా మారుతుంది.

నా ప్రియ మిత్రుడు, సోదరసమానుడైనా రానా నా పాత్రను పోషించడం.. నాకు మరింత సంతోషాన్నిచ్చే విషయం.. కోషిని తెలుగులో చూపించబోతోన్నాడు. అద్భుతంగా చేసేశాడు.. నేను చూపించిన స్టైల్, స్వాగ్ కంటే అద్భుతంగా చేసేశాడు. లుంగీలో అదరగొట్టేశావ్ బ్రో’ అని అన్నాడు.

ఈ చిత్రానికి స్క్రిప్ట్‌ను త్రివిక్రమ్ అందించగా.. సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో నిత్యా మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దిగనుంది.

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్ పేజీను లైక్ చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి

Web Title : prithviraj sukumaran on rana blitz of daniel shekar
Telugu News from Samayam Telugu, TIL Network

Read Entire Article