‘భీమ్లా’ శత్రువు ఎంట్రీకి డేట్ ఫిక్స్.. ‘డానియల్ శేఖర్’ వచ్చేది ఎప్పుడంటే..

4 months ago 16

| Samayam Telugu | Updated: Sep 15, 2021, 5:06 PM

పవన్‌కళ్యాణ్, రానా దగ్గుబాటిలు ప్రధాన పాత్రలో.. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘భీమ్లా నాయక్’. ఈ సినిమాలో టైటిల్ పాత్రలో పవన్ నటిస్తుండగా.. ‘డానియల్ శేఖర్’ అనే పాత్రను రానా పోషిస్తున్నారు.

పవన్‌కళ్యాణ్, రానా

రాజకీయాల కోసం మూడు సంవత్సరాల పాటు సినిమాల నుంచి గ్యాప్‌ తీసుకున్న పవర్‌స్టార్ పవర్‌కళ్యాణ్ రీసెంట్‌గా ‘వకీల్‌సాబ్’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. హిందీలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘పింక్’ సినిమాకు ఇది రీమేక్‌గా రూపొందింది. ఈ సినిమాలో పవన్‌కళ్యాణ్ ఓ పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో కనిపించారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. అయితే దీని తర్వాత ఆయన వరుస సినిమాలను లైన్‌లో పెట్టారు. అందులో మలయాళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ సినిమా రీమేక్ ఒకటి. మలయాళంలో బిజు మీనన్, పృధ్వీ రాజ్ సుకుమారన్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాను తెలుగులో ‘భీమ్లా నాయక్’ అనే టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు. రీసెంట్‌గా పవన్‌కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి మొదటి పాటను వదిలారు చిత్ర యూనిట్. ఈ రెండిటికి కూడా అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పటివరకూ సినిమా నుంచి పవన్ పాత్రకు సంబంధించిన విషయాలు వెల్లడించారు.. కానీ, రానా పాత్ర గురించి ఎలాంటి విషయాన్ని బయటపెట్టలేదు.

తాజాగా రానా ఈ సినిమాలో పోషిస్తున్న ‘డానియల్ శేఖర్’ అనే పాత్రను పరిచయం చేసేందుకు చిత్ర యూనిట్ ఓ డేట్ ఫిక్స్ చేసిందట. సెప్టెంబర్ 17వ తేదీన ‘డానియల్ శేఖర్’ ఫస్ట్‌లుక్‌ లేదా ఫస్ట్ గ్లింప్స్‌ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోందట. అయితే దీనిపై ఇప్పటికైతే ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఇక సినిమా విషయానికొస్తే.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్‌ప్లే అందిస్తుండగా.. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా పవన్ భార్య పాత్రలో మలయాళ బ్యూటీ నిత్య మీనన్ నటిస్తోంది.

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్ పేజీను లైక్ చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి

Web Title : rana daggubati first look from bheemla nayak to release on september 17th
Telugu News from Samayam Telugu, TIL Network

Read Entire Article