భోళా శంకర్.. చిరంజీవి వినూత్న ప్రయోగం! మెగాస్టార్‌తో డైరెక్టర్ సీక్రెట్ ప్లాన్..

4 months ago 2

| Samayam Telugu | Updated: Sep 14, 2021, 11:35 AM

చిరంజీవి హీరోగా రాబోతున్న 'భోళా శంకర్' సినిమాకు సంబంధించి క్రేజీ అప్‌డేట్ బయటకొచ్చింది. ఈ సినిమాతో చిరంజీవి వినూత్న ప్రయోగం చేయబోతున్నారట.

భోళా శంకర్.. చిరంజీవి వినూత్న ప్రయోగం!

దశాబ్దాల కాలంగా టాలీవుడ్ రారాజుగా వెలిగిపోతున్న మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను లైన్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. కొరటాల శివతో 'ఆచార్య' మూవీ కంప్లీట్ చేస్తూనే మరో మూడు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరంజీవి. అందులో ఒకటే తమిళ మూవీ వేదాళంకు రీమేక్‌గా వస్తున్న 'భోళా శంకర్'. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. చిరు పుట్టినరోజున ఈ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసి సర్‌ప్రైజ్ చేస్తూ 'భోళా శంకర్'గా చిరంజీవిని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా గురించిన ఓ క్రేజీ అప్‌డేట్ బయటకొచ్చింది.దర్శకుడిగా తానేంటో ఈ సినిమాతో రుజువు చేసుకోవాలని చూస్తున్న మెహర్ రమేష్.. పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారట. చిరంజీవిని గతంలో ఎన్నడూ చూడని డిఫరెంట్ లుక్‌లో చూపించాలని ఆయన ప్లాన్ చేశారట. మెగా ఫ్యాన్స్‌ని హుషారెత్తించేలా మెగాస్టార్‌ని రెండు డిఫరెంట్‌ లుక్స్‌లో చూపించాలని అనుకుంటున్నారట. అందులో ఒకటి గుండు గెటప్ కాగా.. మరొకటి ఇప్పటి వరకూ గతంలో ఎన్నడూ చూడని లుక్ అనే టాక్ వినిపిస్తోంది. అలా చిరంజీవితో వినూత్న ప్రయోగం చేయబోతున్నారట మెహర్ రమేష్. పైగా సినిమా రిలీజ్ అయ్యేంతవరకు ఈ లుక్ సీక్రెట్‌గా ఉంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ముంబైకి షిఫ్ట్ కాబోతున్న సమంత! సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన చై- సామ్ డివోర్స్ ఇష్యూ
సిస్టర్ సెంటిమెంట్‌తో రూపొందనున్న ఈ సినిమాలో మెగాస్టార్ సోదరిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ లుక్ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే కోల్‌కతాలోని కొన్ని ప్రాంతాల్లో ట్రయల్ షూట్ కూడా పూర్తి చేశారట. ఈ సినిమాతో పాటు మలయాళ చిత్రం లూసీఫర్‌కు రీమేక్‌గా వస్తున్న 'గాడ్ ఫాదర్' సినిమా చేయనున్నారు మెగాస్టార్.

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్ పేజీను లైక్ చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి

Web Title : bholaa shankar: meher ramesh plans on chiranjeevi new look
Telugu News from Samayam Telugu, TIL Network

Read Entire Article