ముంబైకి మకాం మారుస్తున్న శ్రీయ.. ఆయనతో పాటు షిఫ్ట్! అందుకే ఇలా స్కెచ్చేసిందా..?

4 months ago 19

| Samayam Telugu | Updated: Sep 16, 2021, 5:01 PM

ఆండ్రీ కోస్చీవ్‌‌ని పెళ్లాడిన తర్వాత ఇంతకాలం స్పెయిన్‌లో ఉంటున్న శ్రీయ.. ఇక ముంబైకి మకాం మార్చబోతోందని తెలుస్తోంది. భర్తతో పాటు ఆమె ముంబైకి షిఫ్ట్ కాబోతోందని సమాచారం.

ముంబైకి మకాం మారుస్తున్న శ్రీయ.. ఆయనతో పాటు షిఫ్ట్!

ఈ మధ్యకాలంలో సీనియర్ హీరోయిన్ శ్రీయ చేస్తున్న హంగామా మామూలుగా లేదండోయ్. 2018 సంవత్సరంలో విదేశీయుడైన ఆండ్రీ కోస్చీవ్‌‌ని పెళ్ళాడి.. అప్పటి నుంచి సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ భర్తతో రొమాంటిక్ టూర్స్ వేస్తుండటం చూస్తూనే ఉన్నాం. పబ్లిక్ ప్లేసుల్లో కూడా ఎంతో చనువుగా ఉంటూ హాట్ ట్రీట్ ఇస్తూ వస్తోంది ఈ జోడీ. దేశ విదేశాలు చుట్టేయడంతో పాటు రీసెంట్‌గా భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీయ.. ఇకపై ముంబైలోనే ఉండనుందని తెలుస్తోంది. ఇందుకోసం ఆమె పక్కాగా ప్లాన్ చేసుకుందట. ఆండ్రీ కోస్చీవ్‌‌ని పెళ్లాడిన తర్వాత ఇంతకాలం స్పెయిన్‌లో ఉన్న ఈ ముద్దుగుమ్మ.. ఇకపై ముంబైలో కాపురం పెట్టేందుకు సర్వం సిద్ధం చేసుకుందని తెలుస్తోంది. భర్తతో కలిసి ఆమె ముంబై షిఫ్ట్ కాబోతుందట. ఈ మేరకు ఇప్పటికే ముంబైలోని బాంద్రా ఏరియాలో ఓ విలాసవంతమైన భవనం కూడా కొనుగోలు చేశారని సమాచారం. ఈ బంగ్లా కోసం గత కొన్ని నెలలుగా సీక్రెట్‌గా అన్వేషణ చేశారని, చివరకు తమ టేస్ట్‌కి తగ్గట్టు ఓ భవంతి దొరకడంతో వెంటనే కొనేశారని టాక్ నడుస్తోంది.
Sarkaru Vaari Paata: బుల్లెట్ బండిపై మహేష్ బాబు.. భారీ రేంజ్ ఛేజింగ్ సీన్స్! ఫొటోస్ లీక్
పెళ్లి తర్వాత కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న శ్రీయ.. ఈ మధ్యకాలంలో మళ్ళీ బిజీ అవుతోంది. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న RRR సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్న ఈ బ్యూటీ.. 'గమనం' అనే మరో సినిమా చేస్తోంది. మ్యారేజ్ తర్వాత కూడా అదే హాట్ డోస్ దట్టిస్తూ సోషల్ మీడియాలో ఆమె చేస్తున్న పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీంతో ఇవ్వన్నీ చూసి మళ్ళీ సినిమాల్లో ఫుల్ బిజీ కావడానికే శ్రీయ ముంబైకి మకాం మారుస్తోందని చెప్పుకుంటున్నారు జనం.

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్ పేజీను లైక్ చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి

Web Title : heroine shriya saran plans to settle in mumbai with her husband
Telugu News from Samayam Telugu, TIL Network

Read Entire Article