మొటిమలు, మచ్చలు దూరమవ్వాలంటే ఇలా చేయండి..

2 weeks ago 1

| Samayam Telugu | Updated: Sep 5, 2021, 10:35 PM

యోగా వల్ల చాలా రకాల ప్రయోజనాలు మనకి కలుగుతాయి. శారీరకంగా, మానసికంగా ఎన్నో సమస్యలకి పరిష్కారం పొందొచ్చు. అదే విధంగా యోగ ద్వారా చర్మాన్ని మంచిగా ఉంచుకోవచ్చు. అందం అనేది కేవలం మనం బయట నుండి బాగుచేసేది మాత్రమే కాదు. లోపల నుండి కూడా ఎన్నో విధాలుగా మనం అందాన్ని మార్చొచ్చు.

face yoga

ప్రధానాంశాలు:

అందంగా మార్చే ఫేస్ యోగాఫేస్ యోగాతో ఎన్నో బెనిఫిట్స్
ఇలా బయట, లోపల కూడా క్లీన్ చేస్తే మరెంత అందంగా ఉండొచ్చు. దీని కోసం మీరు చేయాల్సిందల్లా సరిగ్గా మంచి పోషకాహారం తీసుకోవడం మరియు ఫేస్ యోగా చేయడం అని నిపుణులు చెప్పారు. ఈరోజు ఎన్నో ఆసక్తికరమైన విషయాలని ఫేస్ యోగా ఎక్స్‌పర్ట్ మనతో చెప్పారు. మరి ఆలస్యం ఎందుకు దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి.
మనకి సూట్ అయ్యే స్కిన్‌కేర్‌ని ఎలా కనుక్కోవాలంటే..
యాక్నే మరియు పిగ్మెంటేషన్ సమస్యలు:

చాలా మంది యాక్నే మరియు పిగ్మంటేషన్ సమస్యలుని ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ సమస్య ఎక్కువ మందిలో ఉంటుంది. అటువంటి వాళ్ళు మార్కెట్లో దొరికే వివిధ రకాల ప్రొడక్ట్స్‌ని ఉపయోగిస్తారు. కానీ ఫలితం కనపడకపోవచ్చు. మీరు కూడా ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా..? మార్కెట్లో దొరికే వివిధ రకాల ప్రొడక్ట్స్ వాడినా ఫలితం లేదా..? అయితే తప్పకుండా ఈ చిట్కాలను పాటించండి.

దీనితో మీరు చాలా అందంగా ఉంటారు. చర్మ సమస్యలు, హార్మోనల్ బ్యాలెన్స్, ఒత్తిడి మొదలైన కారణాల వల్ల వస్తాయి. యాక్నీ అనేది క్రోనిక్ ఇన్ఫ్లమేటరీ స్కిన్ కండిషన్. ఎక్కువ ఆయిల్ ప్రొడక్షన్ అవ్వడం వల్ల బాక్టీరియా చేరిపోయి పింపుల్స్‌కి దారి తీస్తుంది.

కేవలం ముఖం మాత్రమే కాకుండా మెడ, చెస్ట్, భుజాల భాగాలలో కూడా యాక్నీ సమస్య వస్తుంది. అయితే కేవలం స్కిన్ కండిషన్ వలన మాత్రమే కాదు సెల్ఫ్ ఎస్టీమ్ తక్కువగా ఉన్నా సరే వస్తుంది. అదే విధంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. ఆరోగ్యంపైన కూడా ఇది ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా గట్ హెల్త్ పైన బేస్ చేసుకుని ఉంటుంది గుర్తుంచుకోండి.
తల్లి బిడ్డకి ఇలా పాలిస్తే చాలా మంచిదట..
మీకు ఎప్పుడైనా చర్మ సమస్యలు ఉంటే జీర్ణ సమస్యల కారణంగా కూడా అవి రావచ్చు. ఇది ఇలా ఉంటే చాలా మందిలో స్కిన్ పిగ్మెంటేషన్ సమస్యలు కూడా ఉంటాయి. అంటే చర్మం రంగు మారడం.

మెలనిన్ అనేది సెల్స్‌తో కూడి ఉంటుంది. దీని కారణంగా పిగ్మెంటేషన్ మారుతూ ఉంటుంది. హైపర్ పిగ్మెంటేషన్ అంటే ఏమిటి అంటే..? ఈ సమస్య ఉంటే చర్మం డార్క్ గా అయిపోతుంది. చర్మం రంగు మారడం, గ్రే రంగులో స్పాట్స్ రావడం వంటి సమస్యలు కూడా పిగ్మెంటేషన్‌లో సమస్యలు అని చెప్పవచ్చు. అయితే ఇటువంటి సమస్యల బారి నుంచి బయట పడాలి అంటే ఫేస్ యోగ బాగా ఉపయోగ పడుతుంది అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు.

అదే విధంగా ఫేస్ యోగ వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఒంట్లో ఉండే మలినాలను తొలగించడానికి కూడా ఫేస్ యోగ బాగా ఉపయోగ పడుతుంది. అంతే కాదండి హార్మోనల్ బ్యాలెన్స్ ని కూడా ఫేస్ యోగ చేయడానికి సహాయపడుతుంది అని ఆమె అంటున్నారు.

అయితే ఫేస్ యోగానే ఎందుకు చేయాలి ..?

రెగ్యులర్ గా ఫేస్ యోగా చేయడం వల్ల ఫ్రెష్ గా ఉండే ఆక్సిజనెటెడ్ బ్లడ్ మొఖానికి చేరుతుంది దీని కారణంగా ముఖం గులాబీ రంగులో మారి.. చెడు మలినాలను తొలగించి అందంగా ఉంచుతుంది. అలానే చర్మం పై ముడతలు కూడా తొలగించడానికి సహాయ పడుతుంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఫేస్ యోగా చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు మీరు పొందొచ్చు.

ఎంతో అందమైన, ఆకర్షణీయమైన చర్మం మీ సొంతం చేసుకోవచ్చు. ఇక మరి ఫేస్ యోగ ఎలా చెయ్యాలి..?, కలిగే ప్రయోజనాలు ఏమిటి..? ఇలా ఈ విషయాల గురించి కూడా చూసేద్దాం.

iStock-810854272


puff your cheecks:
దీని కోసం మొదట మీరు నోటి నిండా గాలి నింపండి. బుగ్గలు మొత్తం గాలితో నిండి పోయే వరకూ గాలిని తీసుకుని ఆ తర్వాత 10 సెకన్ల పాటు అలా ఉంచండి.ఆ తర్వాత కుడి వైపు కి గాలిని పంపించి అలా 10 సెకండ్ల పాటు ఉండండి.ఆ తర్వాత ఎడమ వైపుకి గాలిని అంతా తీసుకువెళ్లి 10 సెకన్ల పాటు ఉంచి అప్పుడు గాలిని బయటికి వదిలేయండి అంతే.
దీని వల్ల కలిగే లాభాలు:

ఇది చాలా సింపుల్ వ్యాయామం. దీని వల్ల చర్మానికి చాలా లాభం కలుగుతుంది. బ్లడ్ ఫ్లోని ఇది పెంచుతుంది మరియు స్ట్రెస్‌కి సంబంధించిన యాక్నీని తగ్గిస్తుంది.

iStock-1188562831

బెలూన్ పోస్:

దీనికోసం మొదట మీరు నోట్లోకి గాలిని తీసుకుని పది సెకన్ల పాటు టైట్‌గా ఉంచండి.ఆ తర్వాత మీ పెదాల పైన చూపుడు వేలు మధ్య వేలిని పది సెకండ్ల పాటు ఉంచి శ్వాసని అలా వదిలేయండి.ఇలా ఈ విధంగా రోజుకి ఐదు సార్లు చేయండి.
దీని వల్ల కలిగే లాభాలు:

ఇలా చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది మరియు ముఖం మీద పింపుల్స్ తొలగిపోతాయి.మీ ముఖం రంగు కూడా మారుతుంది. ఇలా చేస్తే మలబద్ధకం దూరం..ఇలా వీటిని అనుసరించడం వల్ల ఎన్నో లాభాలు పొందొచ్చు. వీటితో పాటుగా మీరు ఎక్కువ నీళ్లు తాగుతూ ఉండండి. చర్మానికి నీళ్లు మంచి మాయిశ్చరైజర్‌గా పని చేస్తాయి. అదే విధంగా ముఖంలో ఉండే సెల్స్ కి కూడా పోషకాలు అందుతాయి. కనీసం రోజుకి ఆరు నుండి ఎనిమిది గ్లాసులు నీళ్లు తాగడం చాలా ముఖ్యం అని అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇలా ఈ విధంగా మీరు అనుసరిస్తే ఈ సమస్యలన్నీ చిటికెలో మాయమైపోతాయి.

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్ పేజీను లైక్ చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి

Web Title : can face yoga improve beauty know here all details in telugu
Telugu News from Samayam Telugu, TIL Network

Read Entire Article