లంచ్‌కు వెళ్లిన మహేష్ బాబు ఫ్యామిలీ.. సితారపై నమ్రత కామెంట్స్ వైరల్

3 months ago 25

| Samayam Telugu | Updated: Sep 23, 2021, 7:48 PM

మహేష్ బాబు ఎక్కువగా తన కుటుంబానికి సమయం కేటాయిస్తుంటాడు. షూటింగ్ కోసం అవుట్ డోర్‌కు వెళ్లినా కూడా తన వెంట ఫ్యామిలీని తీసుకెళ్తుంటాడు. అలా సర్కారు వారి పాట షూటింగ్ కోసం గత ఏడాది దుబాయ్‌కి వెళ్లారు.

లంచ్‌కు వెళ్లిన మహేష్ బాబు ఫ్యామిలీ.. సితారపై నమత్ర కామెంట్స్ వైరల్

ప్రధానాంశాలు:

ఫ్యామిలీతో మహేష్ బాబు ఎంజాయ్తండ్రితో సితార కొంటె చేష్టలుతండ్రీకూతుళ్లపై నమ్రత కామెంట్
మహేష్ బాబు ఎక్కువగా తన కుటుంబానికి సమయం కేటాయిస్తుంటాడు. షూటింగ్ కోసం అవుట్ డోర్‌కు వెళ్లినా కూడా తన వెంట ఫ్యామిలీని తీసుకెళ్తుంటాడు. అలా సర్కారు వారి పాట షూటింగ్ కోసం గత ఏడాది దుబాయ్‌కి వెళ్లారు. ఈ మధ్య గోవాకు వెళ్లారు. అలా ఎప్పుడూ కూడా మహేష్ బాబు ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తుంటాడు. ఇక తాజాగా మహేష్ బాబు తన ఫ్యామిలీని లంచ్ పార్టీకి తీసుకెళ్లినట్టు కనిపిస్తోంది. అయితే ఇందులో మహేష్ బాబు సర్కారు వారి పాట లుక్కులోనే కనిపిస్తున్నాడు. అంటే సెట్ నుంచి నేరుగా బయటకు వచ్చినట్టు కనిపిస్తోంది.

మామూలుగానే మహేష్ బాబు, సితార ఒక్కచోటకు చేరారు అంటే ఆ ఇద్దరి అల్లరిని భరించడం కష్టం. నమ్రత ఆ ఇద్దరి అల్లరి చేష్టల గురించి గత లాక్డౌన్‌లో ఎన్నో వీడియోలను షేర్ చేసింది. ఈ ఇద్దరూ కలిసి గౌతమ్‌ను ఎలా ఏడిపిస్తారో అందరూ చూశారు. ఇక వీడియో గేములు ఆడే సమయంలోనూ గౌతమ్‌ను ఎలా డిస్టర్బ్ చేస్తారోమనకు తెలిసిందే. తాజాగా సితార, మహేష్ బాబు లంచ్ పార్టీలో చేసిన సందడి గురించి నమ్రత చెప్పుకొచ్చింది.

సితారకు తన తండ్రి మహేష్ బాబుతో లంచ్ చేయడం అంటే ఎప్పుడూ సరదాగానే ఉంటుంది అని నమ్రత చెప్పుకొచ్చింది. ఇక సితార కోసం మహేష్ ఎప్పుడూ ఏదో ఒక సర్ ప్రైజ్ ఇస్తాడని మరీ తెలిపింది. మొత్తానికి సితార మాత్రం తండ్రి చాటు బిడ్డ అని నిరూపించుకుంటోంది. మహేష్ బాబు ఇక సర్కారు వారి పాట షూటింగ్ నడు పాటుగా.. నవంబర్‌లో త్రివిక్రమ్ మూవీని ప్రారంభించబోతోన్నట్టు టాక్ వినిపిస్తోంది.

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్ పేజీను లైక్ చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి

Web Title : namrata shirodkar shares sitara and mahesh babu adorable moments
Telugu News from Samayam Telugu, TIL Network

Read Entire Article