నయనతార బర్త్ డే: విగ్నేష్ శివన్‌ సంబరం.. లవ్‌ లేడీని అలా సర్‌ప్రైజ్‌ చేసిన ప్రియుడు

2 months ago 25

| Samayam Telugu | Updated: Nov 18, 2021, 11:49 AM

Nayanthara Birthday Celebrations: నేడు (నవంబరు18) సౌత్ ఇండియన్ లేడీ సూపర్‌స్టార్‌ నయనతార 37వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె ప్రియుడు, దర్శకుడు విగ్నేష్ శివన్‌తో కలిసి గ్రాండ్‌గా బర్త్ డే సెలబ్రేట్‌ చేసుకుంది నయన్.

నయనతార బర్త్ డే: మిన్నంటిన సంబరం..

నేడు (నవంబర్ 18) సౌత్ ఇండియన్ లేడీ సూపర్‌స్టార్‌ నయనతార 37వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె ప్రియుడు, దర్శకుడు విగ్నేష్ శివన్‌తో కలిసి గ్రాండ్‌గా బర్త్ డే సెలబ్రేట్‌ చేసుకుంది నయన్. కేక్ కట్ చేసి స్పెషల్‌ పార్టీ చేసుకున్నారు. మరికొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోనున్న ఈ జోడీ గత రాత్రి ఫుల్ ఎంజాయ్ చేసిందని సమాచారం. నయనతారకు బర్త్‌డే వేడుకలకు చెన్నై వేదికైంది. గత అర్థర్రాతి నుంచే బర్త్‌డే సంబరాలు షురూ చేసి సరిగ్గా 12 కాగానే నయన్‌తో బర్త్ డే కేక్ కట్‌ చేయించి క్రాకర్స్‌ పేల్చి సందడి చేశాడు విగ్నేష్ శివన్‌. తన లేడీ లవ్‌ను సర్‌ప్రైజ్‌ చేస్తూ బాణాసంచా కాల్చాడు. ఆ కలర్ ఫుల్ వెలుగులు మిన్నంటాయి. ఈ పార్టీకి విగ్నేష్, నయన్‌ కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు హాజరై ఆమెను ఆశీర్వదించారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా తమ అభిమాన హీరోయిన్‌ నయనతారకు బెస్ట్ విషెస్ అందిస్తున్నారు ఫ్యాన్స్‌.
ఏమీ అన్నట్టే ఉండదు కానీ..! ఆ రోజు జీవితంలో మరచిపోలేను.. త్రివిక్రమ్‌పై కోట శ్రీనివాస రావు కామెంట్స్
నయనతార- విగ్నేష్ శివన్ ఇద్దరిది చాలాకాలంగా కొనసాగుతున్న లవ్ ఎఫైర్. గత ఆరేళ్లుగా ఈ జంట ప్రేమాయణం సాగిస్తోంది. మొదటి సీక్రెట్‌గా నడిపించినా ఆ తర్వాత ఓపెన్ అయ్యారు. పెళ్లికి ముందే భార్యభర్తల కంటే ఎక్కువ అన్యూన్యంగా ఉంటూ హల్చల్ చేస్తున్నారు. ఈ ఇద్దరికి సంబంధించిన ఎన్నో ఫొటోస్ నెట్టింట వైరల్ అయ్యాయి. కాగా ఈ ఏడాది ఆరంభంలో కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జోడీ అతిత్వరలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానుంది. కెరీర్ పరంగా దూకుడుగా వెళ్తూనే పెళ్లి ముహూర్తం కోసం వేట మొదలు పెట్టారు ఈ లవ్ బర్డ్స్.

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి

Web Title : vignesh shivan enjoyed in nayanthara birthday celebrations
Telugu News from Samayam Telugu, TIL Network

Read Entire Article