తొలి అనుభవం గురించి చెప్పమన్న నెటిజన్.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 months ago 23

| Samayam Telugu | Updated: Nov 17, 2021, 5:09 PM

తాజాగా అనుపమా పరమేశ్వరణ్ తన ఇన్ స్టాగ్రాంలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్ పెట్టేసింది. ఇందులో అభిమానులు రెచ్చిపోయారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా అడిగేశారు. అందులోంచి ఓ అభిమాని తొలి అనుభవం గురించి అడిగాడు.

తొలి అనుభవం గురించి చెప్పమన్న నెటిజన్.. అనుపమ షాకింగ్ కామెంట్స్

ప్రధానాంశాలు:

నెటిజన్లతో అనుపమ చిట్ చాట్కొంటె ప్రశ్నలకు అనుపమ ఆన్సర్ఆ అనుభవంపై నోరువిప్పిన అనుపమ
కేరళ బ్యూటీ అనుపమ సోషల్ మీడియాలో తన అభిమానులతో నిత్యం టచ్‌లోనే ఉంటుంది. సమయం దొరికినప్పుడల్లా తన ఫ్యాన్స్‌తో ముచ్చట్లు పెడుతుంది. వారి చిలిపి ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. ఎవరైనా హద్దులు మీరి ప్రశ్నలు సంధిస్తే.. అదే రీతిలో వారికి కౌంటర్లు వేస్తుంటుంది. అయితే తాజాగా మరోసారి అనుపమా పరమేశ్వరణ్ తన ఇన్ స్టాగ్రాంలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్ పెట్టేసింది. ఇందులో అభిమానులు రెచ్చిపోయారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా అడిగేశారు.

నీ మాతృభాష ఏంటి? నీకు తెలుగులో మాట్లాడటం ఇష్టమా? లేదంటే మళయాంలో మాట్లాడటం అంటే ఇష్టమా? నీకు ఇష్టమైన పాట ఏంటి? ప్రస్తుతం చేస్తోన్న సినిమాల లిస్ట్ ఏంటి? అంటూ ఇలా రకరకాల ప్రశ్నలు సంధించారు. వాటన్నంటికి సమాధానం చెప్పేసింది అనుపమా. మళయాలం అన మాతృభాష అని, అన్నింటికంటే కళ్లతో మాట్లాడే భాష నాకు చాలా ఇష్టం అది నాకు బాగా తెలుసు అని తెలిపింది.

Anupama


రౌడీ బాయ్స్, కార్తీకేయ 2, 18 పేజీలు, తల్లిపొగతే వంటి సినిమాలతో బిజీగా ఉన్నాను. ఇంకా కొన్నిసినిమాలున్నాయి. కానీ ఇప్పుడే వాటి గురించి చెప్పలేను అని ఇలా తన అభిమానుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఓ అభిమాని తొలి అనుభవం గురించి అడిగాడు. మొదటిసారిగా ఆడిషన్‌కు వెళ్లిన నాటి అనుభవం గురించి చెప్పమని అన్నాడు. దాని గురించి ఇప్పుడు ఆలోచించినా కూడా ఎంతో నర్వస్‌గా ఉంటుందని అంది.

రామ్ అంటే తన ఫ్రెండ్ అని, పునీత్ రాజ్ కుమార్ వంటి వ్యక్తితో పని చేసే అదృష్టం రావడం ఈ జన్మకు దొరికిన వరమని, ఆయన ఎంతో మంచి వారు అంటూ అనుపమ ఎమోషనల్ అయింది.

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి

Web Title : anupama parameswaran reply to fan on asking first audition experience
Telugu News from Samayam Telugu, TIL Network

Read Entire Article