రేయ్ మోహన్ బాబు రా రా.. నీ యబ్బా అంటూ మహిళా నటి వీరంగం

1 month ago 25

| Samayam Telugu | Updated: Oct 16, 2021, 10:22 PM

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సినిమాటోగ్రఫర్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

రేయ్ రా రా మోహన్ బాబు.. నీ యబ్బా అంటూ మహిళా నటి వీరంగం

ప్రధానాంశాలు:

మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణంప్రాంగణంలో మహిళ నటి వీరంగంమోహన్ బాబుపై దారుణమైన ఆరోపణలు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సినిమాటోగ్రఫర్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈవెంట్ అంతా బాగానే జరిగింది. కానీ మహిళా నటి శ్రీనిజ మాత్రం వీరంగమాడింది. మోహన్ బాబు, నరేష్‌ల మీద సంచలన కామెంట్స్ చేసింది. రేయ్, నీయబ్బా అంటూ అందరి మీద విరుచుకుపడింది. విష్ణు వెంటనే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేసింది.

వీకే నరేష్ చేసిన అవకతవకలను బయటపెట్టి కన్నీళ్లు పెట్టుకొంటే వారిని ఆయన ముండమోపి అంటూ కామెంట్ చేశాడు, భర్త చనిపోయిన వాళ్లను కించపరిచే విధంగా నరేష్ మాట్లాడటం చాలా పెద్ద తప్పు అని శ్రీనిజ నరేష్ మీద దుమ్మెత్తిపోసింది. చెన్నై నుంచి పరిశ్రమ తరలి వచ్చిన తర్వాత మహిళా నటీనటులకు ఏం భరోసా ఇచ్చారని ప్రశ్నించింది.

గతంలో మోహన్ బాబు అధ్యక్షుడిగా ఉండి ఏం చేశాడు.. ఇప్పుడు విష్ణు వచ్చి ఏం చేస్తాడంటూ నిలదీసింది. మా ఎన్నికలకు ముందు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాళ్లు, వేళ్లు పట్టుకొన్నారని, పవన్ కల్యాణ్‌ను అడ్డుకొంటామని చెప్పి.. మా అసోసియేషన్ ఎన్నికల్లో విజయం సాధించేలా సహకరించమని కోరారు అంటూ సంచలన కామెంట్స్ చేసింది.

మా అధ్యక్ష పీఠం నుంచి వెళ్లిపోకపోతే మోహన్ బాబు, మంచు విష్ణు, అలాగే ఆయనకు భజన చేసే 30 మందికి సంతాప సభ పెట్టకపోతే.. నా పేరు శ్రీనిజ నాయుడే కాదు అని శపథం చేసింది. ఎన్నికల్లో బ్యాలెట్ బాక్సులు ఇంటికి పట్టుకెళ్తారా? బ్యాలెట్ బాక్సులంటే బొమ్మలాటగా ఉందా? రోడ్డు మీద అమ్మాయిలు కనిపిస్తే లాక్కెళ్లినట్టు అనుకొంటున్నారా? అని శ్రీనిజ నాయుడు రెచ్చిపోయింది.

ఓరేయ్ మోహన్ బాబు.. రారా.. అపరకాళిలా వచ్చాను. రారా ఛాలెంజ్ చేస్తున్నా.. ఆడవాళ్లంటే గౌరవం లేదా? ఎవరైనా ప్రశ్నిస్తే.. నీ అబ్బా.. నీ అబ్బా అని తిడుతావా? నీ సంగతి ఏమిటో చూసిస్తాను. నేను నికార్సైన ఆంధ్రా ఆడదాన్ని అంటూ వీరంగమాడింది. వెంటనే విష్ణు రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి

Web Title : actress srinija fires on mohan babu at manchu vishnu oath taking ceremony
Telugu News from Samayam Telugu, TIL Network

Read Entire Article