సమంత- నాగ చైతన్య ఇష్యూ: తెరపైకి మరో అంశం.. అందుకే అక్కినేని ఫ్యామిలీ సైలెంట్ అయ్యిందా..?

2 months ago 235

| Samayam Telugu | Updated: Sep 16, 2021, 5:38 PM

సమంత- నాగ చైతన్య విడాకుల ఇష్యూపై హాట్ హాట్‌గా చర్చలు నడుస్తున్న నేపథ్యంలో మరో రూమర్ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం సమంత ప్రెగ్నెంట్ ఆమె సన్నిహిత వర్గాలు చెప్పుకుంటున్నాయి.

సమంత- నాగ చైతన్య ఇష్యూ: తెరపైకి మరో అంశం

ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో సమంత- నాగ చైతన్య విడాకుల ఇష్యూపై హాట్ హాట్‌గా చర్చలు నడుస్తున్నాయి. అక్కినేని కుటుంబంతో ఆ ఇంటి కోడలు సమంత కట్ చేసుకోబోతోందని, నాగ చైతన్యతో డివోర్స్ చేసుకోనుందని టాక్ నడుస్తోంది. మరోవైపు చై- సామ్ వివాహ బంధంపై విపరీతంగా రూమర్స్ వస్తున్నాయి. మీడియాలో సైతం ఓ రేంజ్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పటిదాకా ఈ అంశంపై అటు సమంత నుంచి గానీ, ఇటు నాగ చైతన్య నుంచి గానీ ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడం పలు అనుమానాలకు తెర లేపింది. సమంత తన ట్విట్టర్ అకౌంట్‌లో ‘అక్కినేని’ అనే పేరును ఎప్పుడైతే తీసేసిందో అప్పటి నుంచి సోషల్ మీడియాలో పుకార్లు మొదలయ్యాయి. అక్కినేని ఫ్యామీలీ కండీషన్స్ నచ్చక సమంత తన వైవాహిక జీవితానికి ఫుల్‌స్టాప్ పెట్టనుందనే వార్తలు గుప్పుమన్నాయి. దీంతో జనాల్లో ఓ రేంజ్ చర్చలు నడుస్తున్నాయి. ఇంతలో సమంత- నాగ చైతన్య ఇష్యూలో మరో అంశం తెరపైకి వచ్చింది. సమంత ప్రెగ్నెంట్ అని, అందుకే సినిమాలకు దూరంగా ఉంటానని చెప్పిందని అంటున్నారు.
ముంబైకి మకాం మారుస్తున్న శ్రీయ.. ఆయనతో పాటు షిఫ్ట్! అందుకే ఇలా స్కెచ్చేసిందా..?
రీసెంట్‌గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కొంతకాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నట్లుగా సమంత చెప్పుకొచ్చింది. ఇందుకు అసలు కారణం ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్ అని కొందరు చెప్పుకుంటున్నారు. ఎవరో పుట్టించిన డివోర్స్ అంశాన్ని అంతగా పట్టించుకోవడం ఎందుకనే ఈ ఇద్దరూ సైలెంట్‌గా ఉంటున్నారని, త్వరలోనే ఈ గుడ్ న్యూస్ చెప్పి అలాంటి రూమర్లకు చెక్ పెట్టాలని ఆ జోడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే అక్కినేని ఫ్యాన్స్ ఆనందానికి అవధులే ఉండవని చెప్పుకోవచ్చు. సో.. చూడాలి మరి చివరకు అక్కినేని ఫ్యామిలీ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం వస్తుందనేది!.

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్ పేజీను లైక్ చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి

Web Title : samantha- naga chaitanya issue: crazy news viral on social media
Telugu News from Samayam Telugu, TIL Network

Read Entire Article