Taliban హక్కానీ నేతలతో ఘర్షణలో బరాదర్ చనిపోయాడని ప్రచారం!

4 months ago 4

| Samayam Telugu | Updated: Sep 14, 2021, 7:48 AM

ఆగస్టు 15న కాబూల్‌ను ఆక్రమించుకోవడంతో అఫ్గనిస్థాన్ మొత్తం తాలిబన్ల వశమయ్యింది. అయితే, ప్రభుత్వ ఏర్పాటు విషయంలో మాత్రం మిత్రపక్షాల మధ్య విబేధాలు తలెత్తడం సంక్షోభానికి మలుపు తిరిగింది.

ముల్లా అబ్దుల్ బరాదర్

ప్రధానాంశాలు:

పదవుల విషయంలో తాలిబన్ల మధ్య చిచ్చు.అధ్యక్ష భవనంలో హక్కానీ నేతలతో ఘర్షణ.అబ్దుల్ ఘనీ బరాదర్‌కు గాయపడినట్టు ప్రచారం.
అఫ్గనిస్థాన్‌‌లో తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటు విషయంలో అనేక వదంతులు వినిపించాయి. మిత్రపక్షం హక్కానీ నెట్‌వర్క్‌తో విబేధాల వల్లే ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరిగిందని.. రెండు వర్గాలు ఘర్షణపడటంతో తాలిబన్ సహ-వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ గాయపడ్డారని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన చనిపోయాడని సోషల్ మీడియాలో ముమ్మర ప్రచారం జరుగుతోంది. తాలిబన్ తాత్కాలిక ప్రభుత్వ డిప్యూటీ ప్రధానిగా ఉన్న బరాదర్‌ మృతిచెందినట్లు కొన్ని పోస్టులు వైరల్‌ అవుతున్నాయి.

అధ్యక్ష భవనంలో ప్రత్యర్థి వర్గాలతో జరిగిన ఘర్షణలో బరాదర్ గాయపడి, అనంతరం మరణించినట్లు స్థానిక మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. దీంతో తన తన మరణ వార్తలను ఘనీ బరాదర్‌ ఖండించారు. తాను క్షేమంగానే ఉన్నానని, ఏమీ కాలేదని తాజాగా ఓ ఆడియోను ఆయన విడుదల చేశారు. అదంతా తప్పుడు ప్రచారమని ఆయన తెలిపారు. ‘‘నేను చనిపోయినట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి.. గత కొన్ని రోజులుగా నేను ప్రయాణాలలో ఉన్నాను.. ప్రస్తుతం నేను ఎక్కడ ఉన్నా మేమంతా బాగున్నాం’ అని ఆడియోలో పేర్కొన్నారు.

తాలిబన్ల ప్రతినిధి సుహైల్‌ షహీమ్‌ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఖతర్‌‌లోని తాలిబన్ రాజకీయ కార్యాలయం నుంచి సుహైల్‌ షహీమ్‌ ట్విట్ చేశారు. ‘ఇస్లామిక్‌ ఎమిరేట్స్ ఆఫ్‌ అఫ్గనిస్థాన్‌ ఉప ప్రధాని ముల్లా బరాదర్‌ తన మరణవార్తపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు.. ఆ ఆరోపణలన్నీ అబద్దాలు.. వాటిల్లో నిజం లేదు అని పేర్కొన్నారు’ అంటూ ట్వీట్‌ చేశారు.

ఇదే విషయాన్ని అఫ్గన్‌ ప్రముఖ మీడియా సంస్థ టోలో న్యూస్‌ సైతం ధ్రువీకరించింది. ‘తాలిబన్‌ ప్రభుత్వ ఉప ప్రధాని ముల్లా బరాదర్‌ తాను క్షేమంగా ఉన్నట్లు ఓ ఆడియో క్లిప్‌ ద్వారా వెల్లడించారు’ అని తెలిపింది. తీవ్ర తర్జనభర్జనల అనంతరం సెప్టెంబరు 7న తాలిబన్లు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. అయితే, ప్రధానిగా బరాదర్‌ను నియమిస్తారనే ప్రచారం తొలుత జరిగింది. కానీ, మిత్రపక్షం హక్కానీ నెట్‌వర్క్ దీనిని తీవ్రంగా వ్యతిరేకించడంతో ముల్లా మొహమ్మద్‌ హసన్‌ అఖుండ్‌ను ప్రధానమంత్రిగా నియమించారు.

ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌కు ఉప ప్రధాని పదవిని కట్టబెట్టారు. అయితే బరాదర్‌ కొద్ది రోజులుగా ఎక్కడా కనిపించడంలేదు. సమావేశాలకు, ప్రెస్‌మీట్లకు హాజరుకావడంలేదు. ఈ నేపథ్యంలోనే ప్రెసిడెంట్ ప్యాలెస్‌లో జరిగిన ఘర్షణలో ఆయన మరణించినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం అఫ్గన్ సుప్రీంనేత హిబతుల్లా అఖుండ్ కూడా చనిపోయాడంటూ కొన్నేళ్ల కిందట ప్రచారం జరిగింది. కోవిడ్-19 లేదా బాంబు దాడిలో చనిపోయినట్టు వదంతులు వ్యాపించాయి.

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్ పేజీను లైక్ చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి

Web Title : afghanistan: taliban dy pm abdul ghani baradar releases audio statement amid rumours of death
Telugu News from Samayam Telugu, TIL Network

Read Entire Article